Homeఎంటర్టైన్మెంట్Prabhas Spirit Update : కూకట్ పల్లిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్...

Prabhas Spirit Update : కూకట్ పల్లిలో ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Prabhas Spirit Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాల్లో , అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సమయం నుండే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగా, ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఏ రేంజ్ సెన్సేషనల్ […]

Prabhas Spirit Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాల్లో , అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సమయం నుండే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగా, ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఏ రేంజ్ సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విలన్స్ ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 5 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా, టార్గెట్ ని ఎట్టి పరిస్థితిలోనూ మిస్ చేయకుండా ఉండేలా డైరెక్టర్ సందీప్ వంగ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షెడ్యూల్స్ ని పూర్తి చేస్తున్నారు. ఇక లేటెస్ట్ షెడ్యూల్ పై సోషల్ మీడియా లో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది.

నేడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని కూకట్ పల్లి లో చేయబోతున్నారట. అర్థ రాత్రి 12 గంటలకు ఈ షూట్ ని ప్లాన్ చేశారట. ప్రభాస్ తో పాటు ఇతర తారాగణం పాల్గొనబోయే ఈ షూటింగ్ లో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అత్యధిక శాతం హైదరాబాద్ లోని పాపులర్ ప్రాంతాల్లోనే చేస్తున్నారు. లేడీస్ లా కళాశాల లో కొన్ని రోజులు, విమల్ థియేటర్ లో కొన్ని రోజులు ఇంతకు ముందు షూట్ చేశారు. ఇప్పుడు స్టూడెంట్స్ , వ్యాపారవేత్తలు అత్యధిక శాతం తిరిగే కూకట్ పల్లి ప్రాంతం లో చేయబోతున్నారు. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు , ఈ సినిమా షూటింగ్ ని చూసేందుకు ఏ రేంజ్ లో తరళి రాబోతున్నారో చూడాలి.

ఈ చిత్రంలో త్రిప్తి దిమిరి హీరోయిన్ గా నటిస్తుండగా , వివేక్ ఒబెరాయ్ , ఐశ్వర్య మీనన్ లు విలన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో ప్రభాస్ తండ్రి క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్రలో ఒక ప్రముఖ స్టార్ హీరో నటిస్తారని మొదటి నుండి ఒక వార్త ప్రచారం లో ఉంది. ఆ పాత్ర పోషించబోయేది మరెవరో కాదు , మెగాస్టార్ చిరంజీవి అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదట. ఒక బాలీవుడ్ సీనియర్ హీరో ని ఈ పాత్ర కోసం ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper