Mouni Roy divorce : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి యంగ్ హీరోయిన్స్ లో ఒకరు మౌని రాయ్. ఈమె ఒక సీరియల్ హీరోయిన్ , ఈమెకు వచ్చిన ఫేమ్ , క్రేజ్ కారణంగా సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా, అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘విశ్వంభర’ చిత్రం లో ఈమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఇదంతా పక్కన పెడితే , సోషల్ మీడియా లో ఈమె స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు , వీడియోలకు కుర్రాళ్ళు మెంటలెక్కిపోతుంటారు.
అయితే ఈమధ్య కాలం లో ఈమె పై వస్తున్న రూమర్స్ మామూలివి కాదు. తన భర్త సూరజ్ నంబియార్ తో కొన్ని అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకోవడంతో , మౌని రాయ్ ఒక గే అని కొందరు , కాదు లెస్బియన్ అని కొందరు ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈమె ప్రముఖ హీరోయిన్ దిశా పటాని తో ప్రేమలో ఉందని , త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల రూమర్స్ వ్యాప్తి చెందేలా చేశారు. అందుకు కారణం వీళ్లిద్దరు చాలా క్లోజ్ గా వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలే అందుకు కారణం అని చెప్పొచ్చు. వాటిని చూస్తే ఎవరికైనా అలాంటి అనుమానాలు రావడం సహజమే అనుకోండి, అది వేరే విషయం. అయితే సోషల్ మీడియా లో తనపై జరుగుతున్న ఈ ప్రచారం గురించి మౌని రాయ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చాలా ఎమోషనల్ గా రెస్పాన్స్ ఇచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘నేను గే అంటూ సోషల్ మీడియా లో కొంతమంది విస్తృతంగా ప్రచారం చేశారు. అవి చూసి నేను చాలా బాధపడ్డాను. అందులో ఎలాంటి నిజం లేదు. నేను నా మాజీ భర్త తో విడాకులు తీసుకున్నప్పుడు , ఎమోషనల్ గా చాలా కృంగిపోయాను. ఆ సమయం లో నాకు అండగా స్నేహితులు నిలిచారు. నన్ను బాధ నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమం లో వాళ్ళతో నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. అలా వాళ్ళతో సరదాగా తీసుకున్న ఫోటోలను చూసి , నేను గే అంటూ ముద్ర వేశారు. ఇది అత్యంత శోచనీయం’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

