Homeఎంటర్టైన్మెంట్LIK movie collections : విడుదలై వారం కూడా అవ్వలేదు.. అప్పుడే యూట్యూబ్ లోకి ఎంట్రీ...

LIK movie collections : విడుదలై వారం కూడా అవ్వలేదు.. అప్పుడే యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘LIK’

LIK movie collections : ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘LIK’ రీసెంట్ గానే విడుదలై ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ యూత్ ఆడియన్స్ లో ప్రదీప్ కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ చిత్రం మొదటి 5 రోజుల్లోనే 65 శాతం కి పైగా రీకవరీ ని సొంతం చేసుకొని ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాకు టాక్ బాగాలేకపోయిన డీసెంట్ వసూళ్లు రావడానికి మరో కారణం కూడా ఉంది. అదే హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రొమోషన్స్ . ఈ చిత్రం ప్రదర్శితం అవుతున్న థియేటర్స్ లోకి వెళ్లి ఆయన అభిమానులతో ముచ్చటించడం , అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా గా బాగా ట్రెండ్ అవ్వడం తో , వాటికి ఆకర్షితులై ఈ చిత్రానికి టికెట్స్ కొన్నవాళ్ళు కూడా ఉన్నారు.

కేవలం ప్రదీప్ రంగనాథన్ మాత్రమే కాదు, ఈ చిత్రం లో విలన్ గా నటించిన ఎస్ జె సూర్య కూడా థియేటర్స్ కి వెళ్లి ప్రొమోషన్స్ చేయడం ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఆయన ఒక థియేటర్ కి వెళ్లి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియా లో ఎంతలా వైరల్ అయ్యిందో మనమంతా చూశాము. ఇక 5 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం ఒక్క తమిళ నాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి 24 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఇక నిన్న అంబెడ్కర్ జయంతి, సెలవు దినం కావడంతో ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 5 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇదంతా పక్కన పెడితే , ఈ సినిమాని మరికొంతమంది ప్రేక్షకులకు బాగా చేరువ చేయడం కోసం మేకర్స్ ఈ చిత్రం లో చార్ట్ బస్టర్ గా నిల్చిన ‘ధీమా ధీమా’ సాంగ్ ని నిన్న విడుదల చేశారు. ఈ సాంగ్ లోని విజువల్స్ ని చూస్తుంటే, మేకర్స్ ఈ చిత్రం క్వాలిటీ విషయం లో ఎక్కడా తగ్గలేదు అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ క్వాలిటీ ని చూసి అయినా, టాక్ ని చూసి థియేటర్ కి వెళ్లకుండా ఆగిపోయినవాళ్లు , ఇప్పుడు థియేటర్స్ కి వెళ్తారు అనే ఉద్దేశ్యం తో ఏ పాటని యూట్యూబ్ లో వదిలినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి పాటలను , థియేటర్స్ లో విడుదలైన మూడు వారాల తర్వాత యూట్యూబ్ లో విడుదల చేస్తుంటారు. కానీ ఈ చిత్రానికి కేవలం వారం రోజుల్లోపే విడుదల చేశారు. నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ పాటని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...
Oktelugu Epaper