Jasprit bumrah : మావాడు తోపు. దమ్ముంటే ఆపు బుమ్రా. నీ బౌలింగ్లో విధ్వంసం ఖాయం. పరుగుల వరద పారడం తథ్యం. మావాడు కొట్టే కొట్టుడు మామూలుగా ఉండదు. ఆ షాట్లను ప్రత్యేకంగా తీసి.. డాక్యుమెంటరీ రూపొందిస్తాం.. టీమిడియాతో మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ అభిమానులు చేసిన వ్యాఖ్యలు ఇవి.
కానీ, పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలైన తర్వాత.. ఆ జట్టు అభిమానులు గొప్పగా చెప్పుకున్న ఓపెనర్ ఫర్హాన్.. భారీ పరుగులు చేయలేదు. కనీసం అతడు ఖాతా తెరవలేదు. బుమ్రా బౌలింగ్లో పరుగుల వరద అటు ఉంచితే.. కనీసం హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో కూడా అతడు పరుగులు తీయలేకపోయాడు. పాండ్య బౌలింగ్ లో రింకు సింగ్ పట్టిన క్యాచ్ ద్వారా ఔట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న అతడు.. ఒక పరుగు కూడా చేయకుండానే అవుట్ అయ్యాడు…

ఫర్హాన్ మీద పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రమే కాదు.. పాకిస్తాన్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అతడు సూపర్ స్థాయిలో ఆడతాడని.. టీమ్ ఇండియా విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడని భావించారు. అంతేకాదు అందరికీ కేజిఎఫ్ లెవెల్లో ఓవర్ ఎలివేషన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఫర్హాన్ మాత్రం దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు. బుమ్రా బౌలింగ్లో పరుగులు తీయడం కాదు కదా.. కనీసం హార్దిక్ పాండ్యా ను కూడా ఎదుర్కోలేకపోయాడు. తద్వారా సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
ఫర్హాన్ గురించి పాకిస్థాన్ అభిమానులు భారీగా ప్రచారం చేయడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అతని మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీగా అంచనాలు పెట్టుకుంది. కానీ వాటిని అందుకోడంలో ఫర్హాన్ విఫలమయ్యాడు. తీవ్రమైన ఒత్తిడిలో హార్థిక్ పాండ్యా చేతిలో అవుట్ అయ్యాడు.
” ఆటగాళ్ల మీద అంచనాలు ఉండడం సరైనదే. అందులో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ.. ఫర్హాన్ విషయంలో పాకిస్తాన్ అభిమానులు పప్పులో కాలు వేశారు. అతని గురించి వీర లెవెల్ లో ప్రచారం చేశారు. అంతవరకు ఉంటే బాగానే ఉండేది. కానీ వాళ్లు.. ఏకంగా బుమ్రా బౌలింగ్ గురించి కించపరిచే విధంగా మాట్లాడారు. అది కాస్త టీమ్ ఇండియా బౌలర్లలో ఆగ్రహాన్ని కలిగించింది. ఫలితంగా పాకిస్తాన్ జట్టుకు ఓటమి ఎదురైంది. ఫర్హాన్ పరిస్థితి సున్నాకు పరిమితమైపోయిందని” టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
ANOTHER DOCUMENTARY LOADING FOR FARHAN
– Before this match, Pakistani's were trolling Bumrah in the name of Sahibzada Farhan
– Today, Flop Documentary Maker Sahibzada Farhan got Bamboozled by Part-timer Hardik Pandya #INDvsPAK pic.twitter.com/a2UlY1w7KN
— Richard Kettleborough (@RichKettle07) February 15, 2026