Homeక్రీడలుక్రికెట్‌Delhi Capitals Collapse: 264 కొట్టిన ఢిల్లీ జట్టేనా ఇదీ.. సొంత గడ్డమీద పేక మేడ..

Delhi Capitals Collapse: 264 కొట్టిన ఢిల్లీ జట్టేనా ఇదీ.. సొంత గడ్డమీద పేక మేడ..

Delhi Capitals Collapse: చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న పేక ముక్కలతో ఇల్లు కడుతుంటారు. మొదట్లో పేకముక్కలను ఒక్కొక్కటిగా పేర్చి అందంగా రూపొందిస్తారు. ఆ తర్వాత అది వెంటనే కూలిపోతూ ఉంటుంది. అందువల్లే పేక మేడ అనే నానుడి పుట్టింది. సోమవారం నాటి ఐపీఎల్ లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ కూడా పేక మేడను తలపించింది. ఢిల్లీ జట్టు కేవలం ఏడు పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. కనీసం 10 పరుగులైనా చేస్తుందా అనిపించింది. […]

Delhi Capitals Collapse: చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న పేక ముక్కలతో ఇల్లు కడుతుంటారు. మొదట్లో పేకముక్కలను ఒక్కొక్కటిగా పేర్చి అందంగా రూపొందిస్తారు. ఆ తర్వాత అది వెంటనే కూలిపోతూ ఉంటుంది. అందువల్లే పేక మేడ అనే నానుడి పుట్టింది. సోమవారం నాటి ఐపీఎల్ లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ కూడా పేక మేడను తలపించింది.

ఢిల్లీ జట్టు కేవలం ఏడు పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. కనీసం 10 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఢిల్లీ జట్టు క్రితం మ్యాచ్లో పంజాబ్ మీద ఏకంగా 264 పరుగులు చేసింది. ఈ ఐపీఎల్లో ఇదే హైయెస్ట్ స్కోర్. కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. నితీష్ రానా సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయ్యాడు. ఆ స్థాయిలో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. సొంత గడ్డమీద బెంగళూర్ చేతిలో విలవిలాడిపోయింది. కనీసం బంతిని కాచుకోవడానికి కూడా బ్యాటర్లు సిద్ధంగా లేరంటే బెంగళూరు బౌలర్ల బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పిచ్ మీద టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్.. వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. తమ కెప్టెన్ నిర్ణయం సరైనదని బెంగళూరు బౌలర్లు నిరూపించారు. తొలి ఓవర్ లోనే భువనేశ్వర్ కుమార్ బెంగళూరు జట్టుకు బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత వికెట్ల పతనం క్రమంగా సాగిపోయింది. ఒకానొక దశలో ఏడు పరుగులకే ఢిల్లీ చెట్టు 6 వికెట్లు కోల్పోయింది.

ఢిల్లీ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు 0 పరుగులకు అవుట్ అయ్యారు. ముగ్గురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భువనేశ్వర్ కుమార్, హేజిల్ వుడ్ పోటీపడి వికెట్లు తీశారు. సొంత మైదానం అయినప్పటికీ ఢిల్లీ బ్యాటర్లు ఏమాత్రం ప్రతిభ చూపించలేకపోయారు. బెంగళూరు లో ఫుల్ టాస్ బంతులు వేశారు. పుల్లర్ లెంత్ లెవెల్ లో బంతులు రావడంతో ఢిల్లీ బ్యాటర్లు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. పైగా పిచ్ మీద బ్లాక్ సాయిల్ వాడిన నేపథ్యంలో బంతులు రయ్యిమని దూసుకు వచ్చాయి. దీంతో ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్ క్యు కట్టాల్సి వచ్చింది.. ఒకవేళ ఢిల్లీ జట్టు కెప్టెన్ గనక టాస్ గెలిచి ఉంటే అతడు కూడా బౌలింగ్ తీసుకుని ఉండేవాడు. బెంగళూరు బౌలర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో.. ఢిల్లీ బౌలర్లు ఎలాంటి బౌలింగ్ వేస్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper