Kishkindhapuri Teaser Review : ఒకప్పుడు హర్రర్, థ్రిల్లర్ జానర్‌లో చేసిన సినిమా బెల్లంకొండ శ్రీనివాస్‌కు మంచి విజయం అందించింది. అయితే ఆ తర్వాత వరుసగా కమర్షియల్ మూవీస్‌తో ప్రయోగాలు చేయగా, ఆశించిన ఫలితాలు రాక నిరాశ ఎదురైంది. తాజాగా మళ్లీ తన బలమైన రంగమైన థ్రిల్లర్ జానర్‌కే తిరిగి వచ్చాడు.
ఇటీవల నారా రోహిత్, మంచు మనోజ్‌లతోనూ థ్రిల్లర్ ప్రయత్నం చేసి బాక్సాఫీస్ వద్ద ఫలితం రాకపోయినా, ఈసారి మాత్రం కథ మీద పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్తున్నాడు. అదే ‘కిష్కింధపురి’.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించారు. కథలో హర్రర్, థ్రిల్లర్ అంశాలను చక్కగా మిళితం చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన టీజర్ హోరెత్తిస్తున్న సస్పెన్స్, టెన్షన్ సీన్స్‌తో గూస్‌బాంప్స్ తెప్పించింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిపి సినిమాపై మంచి అంచనాలు పెంచేశాయి. ఏదో ఒక దెయ్యం అతీంద్రయ శక్తుల చుట్టూ టీజర్ తిరిగింది. కథను రివీల్ చేయకుండా భయపెట్టే ప్రయత్నం చేశారు. విజువల్స్ బాగున్నాయి.
సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం, బెల్లంకొండ కెరీర్‌లో మరో మలుపు తిప్పే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. హర్రర్ థ్రిల్లర్ లవర్స్ కోసం ‘కిష్కింధపురి’ రాబోతుంది!