Homeఉద్యోగాలుTSRTC Recruitment 2026 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్

TSRTC Recruitment 2026 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్

TSRTC Recruitment 2026 Notification: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా TGSRTC కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంత ప్రజా రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్యవసరంగా ఇతర ప్రయాణాలు చేయాలని అనుకునేవారికి సరైన రవాణా సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలన ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే సమ్మె కారణంగా ప్రైవేట్ వాహనాలు ఇష్టమొచ్చినట్లు ఛార్జీలు పెంచతున్నారు. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లన నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళితే..

ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను నియమించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని చెంగిచెర్ల, ఉప్పల్, కుషాయిగూడ, రాణిగంజ్, మేడ్చల్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, HCU, మియాపూర్-1, మియాపూర్-2 సహా 10 డిపోల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ చర్యలతో ప్రయాణికుల సౌకర్యం దెబ్బతినకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

డ్రైవర్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. కండక్టర్లకు కనీసం 10వ తరగతి పాస్ అవ్వాలి. ఈ తాత్కాలిక నియామకాలు మూడు నెలల పాటు ఉంటాయి. డిపోల వారీగా 10 నుంచి 20 మంది వరకు నియమించనున్నారు. దరఖాస్తులు డిపోల్లోనే స్వీకరిస్తున్నారు. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ద్వారా కూడా ప్రకటనలు చేశారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా స్థాయిలో కూడా డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు జరుగుతున్నాయి. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లోని డిపోల్లో 50 మంది పైగా తాత్కాలిక ఉద్యోగులను చేర్చుకున్నారు. సమ్మెతో రోజుకు 2,000 బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నియామకాలతో సర్వీసులు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు తెలుపుతున్నారు.

మరోవైపు టీజీఎస్‌ఆర్‌టీసీ యూనియన్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మెను ఉధృతం చేశాయి. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో మరింత ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. అయితే ఈ రోజు రాత్రి వరకు నియామకలు చేపట్టి బస్సులను నడుపుతామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేబినేట్ లో సుధీర్ఘంగా చర్చించి సమస్యల పరిష్కారం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న 2013 పీఆర్ సీ బకాయిలను విడుదల చేశామని, మిగిలిన డిమాండ్లపై సానుకూల ధోరణితో ఉన్నామని స్పష్టం చేశారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular