spot_img
Homeఉద్యోగాలు10th pass government jobs: 10 పాస్ అయ్యారా.. ఈ సర్కారీ కొలువులు మీకోసమే.. సిద్ధమేనా..

10th pass government jobs: 10 పాస్ అయ్యారా.. ఈ సర్కారీ కొలువులు మీకోసమే.. సిద్ధమేనా..

10th pass government jobs: రెండు తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేసాయి. చాలామంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మెరిట్ మార్కులు సాధించి అదరగొట్టారు. కొందరేమో తదుపరి చదువులు చదవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొందరేమో ఆర్థిక పరిస్థితి బాగోలేక పదవ తరగతి పూర్తయిన తర్వాత ఉద్యోగాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ప్రైవేట్ కొలువులకు గ్యారెంటీ ఉండదు. సర్కారీ ఉద్యోగాల్లో ఆర్థిక భరోసా అధికంగా ఉంటుంది. 10వ తరగతి పూర్తి అయిన తర్వాత ఉన్న సర్కారీ ఉద్యోగాలు ఏంటి.. వాటికోసం ఎలా శిక్షణ పొందా.. ఆ ఉద్యోగాలు ఎలా సాధించాలి.. ఈ కథనంలో తెలుసుకుందాం.

పదో తరగతి పూర్తయిన తర్వాత చాలావరకు ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.. నేవి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పార మిలిటరీ దళాలు, సాయుధ బలగాలలో పనిచేయడానికి అవకాశాలుంటాయి.

పదవ తరగతి అర్హతతో ఆర్మీలో అగ్ని వీర్ (సాధారణ విధులు), అగ్ని వీర్ (ట్రేడ్స్ మెన్) పోస్టులు సాధించడానికి అవకాశం ఉంటుంది.

నేవీలో అగ్ని వీర్ మెట్రిక్ ఉద్యోగాలు ఉంటాయి. వంట పని, వంటకాలను సరఫరా చేసే పని, శానిటరీ ని పర్యవేక్షించే పని, మ్యూజిషియన్, సెయిలర్, వాచ్మెన్, సఫాయివాల, టాటా ఎంట్రీ ఆపరేటర్, టెలిఫోన్ ఆపరేటర్, ఎల్డిసి, చార్జిమెన్ వంటి పోస్టులు టెన్త్ అర్హతతో సాధించవచ్చు.

ఎయిర్ ఫోర్సులో అగ్ని వీర్ వాయు, నాన్ కంబాటంట్ ఉద్యోగాలు చేయవచ్చు. వీడియో హౌస్ కీపింగ్, హాస్పిటల్ స్టీమ్స్ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.

ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ పోస్టులు కూడా టెన్త్ అర్హతతో భర్తీ చేస్తారు. తర్వాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ లో వచ్చిన నైపుణ్యాల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

పారా మిలిటరీ దళాలలో కూడా కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ అర్హతతో పోటీ పడవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దీనికోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ ద్వారా నియామకాలను భర్తీ చేస్తుంది. రాత పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగం లభిస్తుంది.

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ గ్రూప్ డి పరిధిలో ఉన్న ట్రాక్మెన్, ట్రాక్ ఖలాసి, పాయింట్ మెన్, గేట్ మెన్, హెల్పర్ వంటి పోస్టులను టెన్త్ అర్హతతో భర్తీ చేస్తారు.

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా టెన్త్ అర్హత ఆధారంగా డాక్ సేవక్ పోస్టులు ఉంటాయి. మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper