spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Nani viral video: పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన నేచురల్ స్టార్...

Pawan Kalyan Nani viral video: పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన నేచురల్ స్టార్ నాని.. వీడియో వైరల్..

Pawan Kalyan Nani viral video: ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ కి భయపడి ఒక్క కామెంట్ చేయడానికి కూడా ఆలోచించే రోజుల్లో, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో పాటు గొంతెత్తి తన స్వరాన్ని వినిపించే ధైర్యం చేసిన నటుడు నేచురల్ స్థార్ నాని(Natural Star Nani). టికెట్ రేట్స్ విషయంలో అప్పటి ప్రభుత్వ వైఖరి పై పవన్ కళ్యాణ్ కాకుండా, ఇండస్ట్రీ నుండి ఇలా చేయడం చాలా తప్పు అని మాట్లాడిన ఏకైక నటుడు నాని మాత్రమే. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాని ని నెత్తిన పెట్టుకొని తిరగడం మొదలు పెట్టారు. పవన్ సినిమా విడుదలైతే మొదటిరోజు మొదటి ఆట ఎలా అయితే థియేటర్స్ కి వెళ్లి చూసేవారో , నాని సినిమాలను కూడా అలా చూడడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు మరోసారి నాని పవన్ కళ్యాణ్ కి సపోర్టు గా ప్రభుత్వం చేస్తున్న మంచు పనుల గురించి ప్రమోట్ చేశాడు .

పవన్ కళ్యాణ్ రీసెంట్ గా పర్వరణ శాఖ మంత్రిగా , స్వచ్ఛ రధం అనే కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై నాని మాట్లాడుతూ ‘సాధారణంగా మన చుట్టూ బోలెడంత చెడు ఉంది , దాని గురించి సోషల్ మీడియా లో కానీ , మీడియాలో కానీ , జనరల్ గ్రూప్స్ లో కానీ , స్నేహితుల తో కానీ మాట్లాడుతుంటాము. కానీ చెడుకంటే ముందు మంచి గురించి మాట్లాడుకోవడం ముఖ్యం. ఈమధ్యనే తెలిసింది , స్వచ్ఛ రథాలు అనే గొప్ప కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరుపున ప్రారంభించారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా భావించవచ్చు. మన ఆరోగ్యానికి సంబంధించి కానీ , మన సొసైటీ కి సంబంధించి కానీ , అతి పెద్ద సమస్య ఏమిటంటే , చెత్తని మ్యానేజ్ చేయడం లో మనకి ఎలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలు జరగలేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చిన , దేశాలతో పోల్చిన ఎక్కడో ఈ విషయంలో మనం వెనకబడి ఉన్నాము. దీనిపై జనాల్లో ఒక అవగాహనా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం శుభపరిణామం’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియోలో చూడండి. నిన్న కూడా అయన మేడే సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన ఒక పోస్టర్ ని విడుదల చేసాడు. పీవీ సింధు, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వంటి వారు కూడా ఈ కార్యక్రమం లో ప్లాగొన్నారు, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈరోజు నాని విడుదల చేసిన ఈ వీడియో క్రింద పవన్ కళ్యాణ్ అభిమానులు కృతఙ్ఞతలు తెలియ1జేస్తూ , ‘ప్యారడైజ్’ చిత్రం ఇక నీది కాదు , మాది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
Oktelugu Epaper