Nagarjuna Mass Movie: అక్కినేని వారసుడిగా వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్‌గా వెలుగొందుతున్న స్టార్ హీరో అక్కినేని నాగార్జున. కెరీర్ కొత్తలో క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. వరుస హిట్లతో అక్కినేని వారసుడిగా, స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అతని తరం హీరోలకు పోటీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని కింగ్ అని నిరూపించుకున్నాడు. అయితే ప్రతి మనిషి జీవితంలో గెలుపు ఉన్నట్టే ఓటమి కూడా ఉంటుంది. మరి నాగార్జున జీవితంలో కూడా ఓటమి లేకపోలేదు. తన జీవితాన్ని డౌన్‌ట్రెండ్‌లో చూడక తప్పలేదు.
అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగార్జున 2000వ సంవత్సరంలో మొత్తం ఆరు సినిమాలను విడుదల చేశాడు. అందులో నిన్నే ప్రేమిస్తా, అధిపతిలాంటి గెస్ట్ అప్పియరెన్స్ సినిమాలు హిట్ సాధించగా, తరువాత వచ్చిన నువ్వు వస్తావని సినిమా కూడా హిట్ సాధించింది. అయితే ఆ తరువాత వచ్చిన ఎదురులేని మనిషి, బావ నచ్చాడు, ఆకాశ వీధుల్లో, స్నేహమంటే ఇదేరా సినిమాలు వరుసగా ఘోరమైన అపజయాలు మూటగట్టుకున్నాయి. తరువాత వెంటవెంటనే సంతోషం, మన్మధుడు, శివమణి, నేనున్నాను సినిమాలతో సక్సెస్ బాట పట్టాడు.
అప్పుడప్పుడే కుదుటపడుతున్న తన మార్కెట్‌ను కాపాడుకోవడానికి నాగార్జున సినిమాల విషయంలో ఆచూతూచి వ్యవహరిస్తున్నాడు. ఆ సమయంలో రాఘవ లారెన్స్ తన దగ్గర కథ ఉందని, తాను డైరెక్టర్ కావాలని అనుకుంటున్నానని చెప్పడంతో కథ చెప్పమని అడిగాడు నాగ్. దీంతో కథ చెప్పడం మొదలు పెట్టాడు రాఘవ. సినిమా ఎలా తీయాలని అనుకుంటున్నాడో కళ్ళకు కట్టినట్టు వివరించాడు. దీంతో రాఘవ కథను మెచ్చిన నాగ్.. అక్కడిక్కడే తన సొంత నిర్మాణ సంస్థలో రాఘవతో తన తరువాతి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు.
Also Read: తెలుగు తెర పై అత్యంత దారుణమైన విలన్ ఆయనే !
ఈ సినిమాకు మ్యూజిక్ దేవి ప్రసాద్‌ను తీసుకున్నారు. మాటల రచయితగా పరుచూరి బ్రదర్స్‌ను తీసుకున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న శ్యామ్ కే నాయుడుని కెమెరామెన్‌గా, ఛార్మి, జ్యోతికలకు హీరోయిన్లుగా, సునీల్, వేణుమాధవ్ లాంటి కామిడీయనట్లు తీసుకొని సినిమా మొదలు పెట్టారు. అంతా అనుకున్నట్టు సినిమా పూర్తి చేశారు. ఆ సినిమాకు ‘మాస్’ అని టైటిల్ పెట్టారు. కట్ చేస్తే సినిమా రిలీజ్, అసలే మాస్ అని టైటిల్ పెట్టడంతో ఎలా ఉంటుందో అన్న ఆతృతతో సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ టాక్‌తో బయటికి వచ్చారు. దీంతో రాఘవలోని దర్శకుడికి మంచి మార్కులు పడడంతో పాటు, నాగార్జున నిర్మాతగానూ, హీరోగానూ మంచి విజయాలు అందుకున్నాడు. కాగా ఆరు పదుల వయసులోనూ నాగార్జున తన మార్కెట్ తగ్గిపోకుండా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమాను విడుదల చేసి హిట్ అందుకున్నాడు నాగార్జున.
Also Read: హీరోలందు పవన్ కళ్యాణ్ వేరయా !
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Interesting facts about nagarjuna mass movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com