spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP vs Tollywood: వైసీపీ వ‌ర్సెస్ టాలీవుడ్‌.. ఆ ఎమ్మెల్యే కు దిమ్మ తిరిగే కౌంట‌ర్...

YCP vs Tollywood: వైసీపీ వ‌ర్సెస్ టాలీవుడ్‌.. ఆ ఎమ్మెల్యే కు దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇస్తున్న ప్రొడ్యూస‌ర్లు..

YCP vs Tollywood:  గత కొద్ది రోజులు ఏపీ సర్కారు వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనే సీన్ కొనసా..గుతోంది. వైసీపీ నేతలు కొద్ది రోజుల నుంచి సినీ పరిశ్రమపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ఒకరు నిర్మాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. టాలీవుడ్ ఆత్మగౌరవంపైన వైసీపీ సర్కారు దాడి చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ప్రముఖులు సైతం ఇక ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆత్మ గౌరవం మీద దెబ్బ పడితే సహించేది లేదన్న రీతిలో స్పందిస్తున్నారు.

Jagan Cheated

తాజాగా ఫిలిం చాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ సైతం వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ ఖండించాడు. రైటర్ వీఎన్ ఆదిత్య తన స్పందనను తన రైటింగ్ లో తెలిపాడు. అలా సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమదైన స్టైల్‌లో ఏపీ సర్కారుపైన దాడి చేస్తున్నారు. తమకు అస్సలు గౌరవమే లేదన్న రీతిలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు.

Also Read:  యూపీ : బీజేపీలో కొలిక్కి వస్తున్న అభ్యర్థుల ఎంపిక.. యోగి అక్కడి నుంచే?

ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు గత కొద్ది రోజుల నుంచి కావాలనే సినీపరిశ్రమను టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయానికి పలువురు సినీ ప్రముఖులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక ఊరుకునేది లేదని ఇండస్ట్రీని కాపాడుకునేందుకుగాను అందరూ కలిసి రావాలని అనుకుంటున్నారని టాక్. సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయమై వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో ఇంకా ఇబ్బందిర పరిస్థతులు ఏర్పడ్డాయి.

సినిమా టికెట్ల ధరల విషయమై తన వాదనను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమరావతికి వెళ్లి మరీ తన వాదనను వినిపించాడు. ఆ తర్వాత కేవలం ఒకే గంటలో 24 ట్వీట్లు చేసి పలు ప్రశ్నలను ప్రభుత్వాని ఎదుట అయితే ఉంచాడు. టికెట్ల ధర సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. కానీ, ఆయన ఆ క్రమంలోనే సినీ వ్యాపారం చేసిన అనుచిత వ్యాఖ్యలపై సినీ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ పెద్దలు ఒక తాటి మీదకు వచ్చి ఏపీ సర్కారు వద్దకు వెళ్లి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తారో లేదో చూడాలి..

Also Read:   ఏపీ సర్కార్ ‘పీఆర్సీ’ ఫైట్ కు మళ్లీ సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగులు

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper