YCP MLC Anantha Uday Bhaskar: వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ తీరు విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతోంది. జిల్లాలో ఆయన కనుసన్నల్లోనే పాలన అంతా సాగాలనే మొండి వైఖరితో ఉండేవాడు. ఏ పని కావాలన్నా ఆయన ప్రమేయం ఉండాల్సిందే. దీంతో రంగురాళ్లు, కలప అక్రమ రవాణా, ఇసుక, మట్టి తవ్వకాలు, పేకాట శిబిరాలు ఏ అసాంఘిక కార్యకలాపాలైనా ఆయన సాయం ఉండాల్సిందే. లేకపోతే సాగవు అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయన వ్యవహార శైలిపై అందరు ఆగ్రహంతో ఉన్నారు. తవ్వేకొద్దీ అక్రమాలే. వెలుగు చూసే కొద్దీ నిజాలే. ఆయన చరిత్ర చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. కుర్చీ లేని రాజుగా మన్యంలో ఓ వెలుగు వెలిగిపోవడంపై అందరు ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుత కాలంలో కూడా ఇంతటి నియంతలా వ్యవహరిస్తున్న ఎవరు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవంటే అతడి నెట్ వర్క్ ఎంత ఉందో అర్థమైపోతోంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకుని జిల్లాలో అన్నింట్లో వేలు పెట్టి తనకు వాటా కావాల్సిందేనని ముక్కుపిండి మరీ వసూలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరిని కలవాలన్నా మొదట అతడిని కలిస్తేనే పని జరిగేది? అంతటి నెట్ వర్క్ పెట్టుకున్నట్లు సమాచారం.
Also Read: Revanth Reddy: కేసీఆర్ దున్నపోతు కంటే అధ్వానంగా అయ్యాడు: రేవంత్ రెడ్డి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమాలు అనేకం ఉన్నాయి. బినామీల పేరిట క్వారీలు, చేపల చెరువులు, గంజాయి, కలప అక్రమ రవాణా అంతా ఆయన కనుసన్నల్లోనే సాగుతోందని తెలుస్తోంది. ఆయన మాటే శాసనం. ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటుంది. ఇంత జరుగుతున్నా ఎక్కడ కూడా ఆయన పేరు బయటకు రాకపోవడం గమనార్హం. గతంలో అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్ గా నమైదైనా 2019లో వైసీపీలో చేరి దాన్ని ఎత్తివేయించుకున్నట్లు సమాచారం.

2014 శాసనసభ ఎన్నికల్లో కొండకాపు(ఎస్టీ) నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో నామినేషన్ వేయగా ఆయన ఎస్టీ కాదని ప్రత్యర్థులు ఆధారాలు చూపడంతో నామినేషన్ రద్దయింది. దీంతో నామినీగా ఉన్న రాజేశ్వరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి గెలిపించి తరువాత ఆమె ఏటీఎంను తన దగ్గరే పెట్టుకుని ఆమె గౌరవ వేతనాన్ని కూడా అతడే తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంతటి దుర్మార్గమైన వ్యక్తిపై ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు చేయకపోవడం విడ్డూరమే.
2019లో నాగులపల్లి ధనలక్ష్మిని ఎమ్మెల్యేగా గెలిపించి అదే విధంగా అక్రమాలు కొనసాగించారు. ఆమె పేరు చెప్పుకునే అందిన కాడికి దోచుకున్నారు. ఫ్లెక్సీలు, శిలాఫలకాలపై తన పేరు లేకోతే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిసింది. మన్యంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు ఆయనే చిరునామా. ఏ చిన్న వ్యవహారమైనా ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహించడం సాధారణమే. ఇంతటి అక్రమాల ఘోష ఎవరిని కదిలించలేదు. అందుకే ఇంత కాలం ఆయన అక్రమాలు వెలుగు చూడలేదని తెలుస్తోంది. వెయ్యి గొడ్లను తిన్న రాబందు అయినా ఒక్క గాలివానకే కూలిపోతుందన్నట్లు అనంత అక్రమాలు ప్రస్తుతం వెలుగులోకి రావడంతో అతడిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.
Also Read:BJP Telangana: దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కేసీఆర్ కుట్ర!
Recommended videos
[…] Also Read: YCP MLC Anantha Uday Bhaskar: మన్యంలో అరాచకాలు..వైసీపీ ఎ… […]