World should learn from India: భారత కాశ్మీర్లోని పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య విద్యావాతరణం నెలకొన్న విషయం తెలిసిందే. కొన్ని రోజులపాటు వార్ జరిగిన తర్వాత తెలుగు దేశాలు యుద్ధం ముగిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే యుద్ధం ముగిసిన తర్వాత కొంతమంది భారత్ త్వరగా యుద్ధం ముగించిందని ప్రకటనలు చేశారు. కానీ ఈ ప్రకటనలపై ఇప్పటికే భారత్ కు చెందిన ఆర్మీతో పాటు ఇతర అధికారులు స్పందించారు. తాజాగా ఇండియన్ ఆర్మీ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరిగిన దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. దీనిపై ఆయన ఏమన్నారంటే?
పాకిస్తాన్ పై భారత్ త్వరగా యుద్ధం ముగించిందని కొందరు విమర్శలు చేస్తున్నారని.. పాకిస్తాన్ దేశం ఓడిపోయిన తర్వాత యుద్ధం కొనసాగించడం దేనికి అని ఆయన తెలిపారు. మన దేశం లక్ష్యం శత్రు దేశాన్ని ఓడించడం.. అంతేకానీ ఓడిపోయామని ప్రకటించినా కూడా యుద్ధం కొనసాగించి నష్టం చేకూర్చడం లక్ష్యం కాదని ఆయన అన్నారు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య సంవత్సరంగా యుద్ధం కొనసాగుతుందని.. ఇప్పటికే రెండు దేశాలు భారీగా నష్టపోయాయని తెలిపారు. కానీ భారత్ ఏమాత్రం నష్టపోకుండా యుద్ధం గెలిచిందని ఆయన తెలిపారు. యుద్ధం ఎలా చేయాలో భారత్ ను చూసి నేర్చుకోవాలని ఆయన అన్నారు.
కాశ్మీర్లోని pahalgam లో 2025 ఏప్రిల్ 22న ఉగ్రవాదులు ఒక్కసారిగా వచ్చి పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. 2019 తర్వాత అత్యంత ప్రాణాంతకమైన దాడి దీనిని భావించారు. దీంతో అప్రమత్తమైన భారత్ 2025 మే 1 అర్ధరాత్రి నుంచి పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధానికి ఆపరేషన్ సింధూరం అని పేరు పెట్టింది. పహల్గాం ఘటనలో కొత్తగా పెళ్లయిన వారిలో భర్త మరణించిన సంఘటన ప్రపంచమంతా కలిచివేసింది. దీంతో మరోసారి ఆడవారి మొదటి పై సింధూరం తొలగినీయకుండా చూస్తామని నినదిస్తూ ఆపరేషన్ సింధూర్ ను కొనసాగించారు. ఈ యుద్ధంలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఉగ్రవాదుల ప్రధాన కేంద్రమైన జైషే మహమ్మద్ స్థావరంలో ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం తీసుకున్న తర్వాత ఇరుదేశాలు యుద్ధ విరమణను ప్రకటించినట్లు ఆయా ప్రభుత్వాలు తెలిపాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ ముందే యుద్ధం విరమించుకున్నట్లు ప్రకటించిందని.. అందుకే తాము కూడా యుద్ధంలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశామని పేర్కొన్నారు. అయితే కొంతమంది పాకిస్తాన్ పై యుద్ధం త్వరగా ముగించారని విమర్శలు చేశారు. కానీ వీటిపై ప్రభుత్వ అధినేతలు సమాధానమిస్తూ వస్తున్నారు.