Karma comes back: మనం తీసుకున్న పాపం మనకే శిక్ష తగులుతుందని కొందరు పెద్దలు చెబుతారు. కానీ నేటి కాలం వారు అవేవి పట్టించుకోరు. ఏ పాపం చేయని వారు కూడా చాలా కష్టాలు పడుతున్నారని.. పాపాలు చేసిన వారు ఎన్నో రకాలుగా సంతోషంగా ఉంటున్నారని సమాధానం ఇస్తుంటారు. కానీ పురాణంలోని కొన్ని కథల ప్రకారం ఒక జన్మల చేసుకున్న పాపం మరో జన్మలో కర్మఫలం అనుభవించాల్సిందేనని అంటూ ఉండగా.. నేటి ఆధ్యాత్మికవేత్తలు మాత్రం ఈరోజు చేసిన పాపానికి ఈరోజు శిక్ష అనుభవించాల్సి కూడా వస్తుందని చెబుతుంటారు. అందుకు ఉదాహరణగా ఈ స్టోరీ లోకి వెళ్దాం. ఒకరు చేసిన పాపానికి వారే అనుభవించాల్సి వస్తుందని ఈ కథ తెలుపుతుంది.
అడవిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తాడు. అతని కళ్ళు ఒక చెట్టు వైపు చూస్తాయి. ఆ చెట్టుపై ఉన్న పండ్లలను తినాలని నోరు అనుకుంటుంది. ఆ తర్వాత కాళ్లు అటువైపు తీసుకెళ్తాయి. చెట్టు దగ్గరికి వెళ్లిన తర్వాత చేతులు కాళ్లు కలిసి చెట్టెక్కిస్తాయి. అయితే ఆ చెట్టు ఎక్కిన వ్యక్తిని చూసి తోటమాలి అక్కడికి వస్తాడు. చెట్టు ఎక్కిన వ్యక్తి వీపుపై కొడతాడు. వీపుపై దెబ్బలు పడగానే కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి. ఇలా చివరికి ముందుగా పండ్లను చూసిన కళ్ళు.. చివరికి నీళ్లు తెచ్చుకుంటాయి. దీనికి పట్టి తెలుస్తుంది ఎప్పుడు చేసిన పాపాలు అప్పుడే శిక్షలు అనుభవించే రోజులు కూడా ఉన్నాయని కొందరు అంటున్నారు.
అలాగే సమాజంలో కూడా మంచితనంతో ముందుకు వెళ్లాలని.. ఇతరులను బాధ పెట్టడం లేదా తప్పులు చేయడం వల్ల ఎప్పటికైనా శిక్షను అనుభవించాల్సి వస్తుందని చెబుతున్నారు. నేటి కాలంలో కొందరు డబ్బు సంపాదన కోసం అక్రమార్గాలు తప్పుతున్నారు. మరికొందరు తమ ఆనందం కోసం ఇతరులను బాధపెడుతున్నారు. ఇలా ఏ రకమైన తప్పులు చేస్తే.. ఆ రకమైన శిక్షలను కచ్చితంగా అనుభవించాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే కొందరు ఎలాంటి తప్పులు చేయకుండా బాధపడుతున్నారు కదా అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ఇలాంటివారు గత జన్మలో చేసిన పాపాలకు కర్మఫలం అనుభవిస్తున్నారని.. వారు ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి దైవానుగ్రహం పొందాలని సూచనలు చేస్తున్నారు.
అంతేకాకుండా కొన్ని మంచి పనులు చేయడం వల్ల కూడా పాపపరిహారం ఉంటుందని పేర్కొంటున్నారు. ఒకసారి మనిషి తప్పు చేస్తే మరోసారి దానిని సరిదిద్దుకునే అవకాశం దేవుడు కల్పిస్తాడని.. అప్పుడు కూడా తప్పులు చేస్తే ఎప్పటికీ శిక్షలు అనుభవించక తప్పదని నీతి తెలుపుతుంది. అందువల్ల తప్పులు చేసే సమయంలో శిక్షల గురించి కూడా ఆలోచించాలని ఆధ్యాత్మిక వ్యాధులు చెబుతున్నారు.