iQOO Z11x 5G: చైనా మొబైల్ కంపెనీస్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ప్రముఖ Vivo తన మొబైల్ తో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే ఈ కంపెనీ యొక్క సబ్ బ్రాండ్ అయినా iQOO కొత్త మొబైల్ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ మొబైల్ గురువారం నుంచి ఈ కామర్స్ ప్లాట్ ఫారం పై అందుబాటులో ఉండనుంది. మొత్తం మూడు వేరియెంట్లలో రెండు రంగుల తో రాబోతున్న ఈ మొబైల్ లో అద్భుతమైన సాఫ్ట్వేర్ తో పాటు మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే కెమెరా సెట్ అప్ కూడా నాణ్యమైనదిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ ధర ఎంతో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంది. మరి దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మొబైల్ మార్కెట్లో ఇప్పటికే iQOO ప్రత్యేకత చాటుకుంది. అయితే వినియోగదారుల అభిరుచులు మారుతూ ఉండడంతో వారికి అనుగుణంగా కొత్త మొబైల్స్ ను పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా లేటెస్ట్గా iQOO Z11x5g మొబైల్ నో ఆవిష్కరించింది. ఈ మొబైల్ డిస్ప్లే ప్రత్యేకంగా ఉంది. 6.76 అంగుళాల LCD స్క్రీన్ ను కలిగిన ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1200 nits బ్రైట్నెస్ ఉండడంతో ఇలాంటి వాతావరణం లోనైనా వీడియోలు వీక్షించేందుకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో IP 68, IP 69+ రేటింగ్ ఉండడంతో 83% కలర్ gamat ను అందిస్తుంది. అలాగే 382 పిక్సెల్ సాంద్రతతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఐ క్యు కొత్త మొబైల్ లో సాఫ్ట్వేర్ లేటెస్ట్ యూజర్స్ కు అనుగుణంగా ఉండనుంది. ఇందులో 4 NM అక్కకు మీడియా టెక్ dimensity 7400 టర్బో చీప్ సెట్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి వేగవంతంగా పనిచేస్తుంది. ఇందులో 8 GB ఉండడంతో పాటు 256 UFS 3.1 స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫోటోలు, వీడియోలతో పాటు ఫైల్స్ ను స్టోర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఈ మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 MP మెయిన్ కెమెరా ఉండడంతో పాటు 2 MP అల్ట్రా వైడ్ సెన్సార్ పని చేస్తుంది.32 MP ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా ఉంది. ఇందులో బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. 7200 mAh బ్యాటరీ ఉండగా ఇది 44 W ఫాస్టెస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేయనుంది. అలాగే యూఎస్బీ టైప్ సి పోర్ట్, జిపిఎస్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి. ఈ మోడల్ ధర రూ.18,999 మంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మొబైల్ ధర.22,999 తో విక్రయిస్తున్నారు. యాక్సిస్, ఎస్బిఐ బ్యాంకుల ద్వారా ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది. అమెజాన్ ఫ్లాట్ ఫారం పై దీని కొనుగోలు చేయవచ్చు.
