Blackmail: మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మోసం చేయడానికి బాలుడిని సైతం వినియోగించుకోవడం సంచలనం సృష్టిస్తోంది. పైగా అతడిపై లైంగిక దాడి చేసి ఇంట్లోని బంగారం, డబ్బును దోచుకెళ్లడం ఆందోళనకు గురి చేస్తోంది. మాజీ ప్రియుడితో కలిసి ఓ యువతి చేసిన మోసానికి బాలుడి కుటుంబం బలైపోయింది. ఈ నేపథ్యంల నయా మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడి కుటుంబం ఇటీవల ఇల్లు మారారు. దీంతో అల్మారాలో ఉన్న 20 తులాల బంగారం మాయమైంది. ఏం జరిగిందని ఆరా తీయగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తానే ఓ యువతికి ఇచ్చానని బాలుడు చెప్పడంతో విషయం తెలిసింది. రూ.6 లక్షల నగదు కూడా కనిపించకుండా పోయింది. తల్లి బాలుడిని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పడంతో ఆశ్చర్యపోయింది.
బాలుడిని కూడా మోసం చేసేందుకు వెనుకాడలేదు. తెలిసి తెలియని ప్రాయంలో ఇలాంటి దారుణం చోటుచేసుకోవడంతో ఏం చేయాలో కూడా అతడికి పాలుపోలేదు. దీంతో ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. తీరా విషయం తెలిస్తే ఏం జరుగుతుందోనని బెంగ పట్టుకుంది. కానీ ఎప్పటికైనా నిజం తెలియకుండా పోతుందా? కన్నవారికి తెలిసిపోవడంతో బాలుడిలో కంగారు మొదలైంది. జరిగిన విషయం పూస గుచ్చినట్లు చెప్పడంతో తల్లి సైతం నిర్ఘాంతపోయింది.
Also Read: Viral: లేటు వయసు.. ఘాటు ప్రేమ
బాలుడిని తాను చదివే పాఠశాల నుంచి చార్మినార్ లోని ఓ లాడ్జికి తీసుకెళ్లి మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడింది. అంతే కాకుండా దాన్ని తన మాజీ ప్రియుడితో వీడియో తీసి బాలుడిని బ్లాక్ మెయిల్ చేసి ఇంట్లోని నగదు, బంగారం ఇవ్వాలని బెదిరించింది. దీంతో బాలుడు ఇంట్లోని వాటిని వారికి అప్పగించాడు. ఇది జరిగి మూడేళ్లవుతున్నా ఇప్పుడే వెలుగులోకి రావడంతో నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కష్టాలను ఎదురుకుంది విధిని ఎదురించి పోరాడింది గెలించింది ..! చదువుకుంటూ ఆటో నడుపుతూ ఆమె పేరు ….!