Woman Jailer Love Story: ప్రేమ ఎప్పుడు.. ఎవరిలో ఎలా కలుగుతుందో.. ఎవరూ అంతగా అంచనా వేయలేరు. అందుకే అందుకే ప్రేమను అచంచలమైన వ్యవహారమని చెబుతుంటారు. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. మనసులు కలిస్తే.. అభిప్రాయాలు బలపడితే చాలు.. ప్రేమ అనేది మొదలవుతుంది. ఆ ప్రేమను మరో స్థాయి దాకా తీసుకెళ్తే అది వివాహంతో సమాప్తం అవుతుంది. ప్రేమను బలమైన బంధానికి తొలిమెట్టు అని పిలుస్తుంటారు. వివాహంతో ఆ ప్రేమ మరింత సుస్థిరమవుతుంది.
ముందుగానే చెప్పినట్టు ప్రేమ అనేది గుడ్డిది.. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. ఆర్థిక నేపథ్యంతో సంబంధం ఉండదు. కేవలం ఒక వ్యక్తిలో అభిప్రాయాలు నచ్చితే చాలు.. ప్రేమ అనేది యధావిధిగా కలుగుతుంది. అది ఆస్తిని కోరదు. అంతస్తును అడగదు.. స్వచ్ఛమైన ప్రేమ అయితే కేవలం ఎదుటివారి సౌఖ్యాన్ని మాత్రమే కోరుతుంది.. త్యాగంతో నిత్యం ఓలాడుతూ ఉంటుంది.
ప్రేమ ఎలా , ఎప్పుడు పుడుతుందో.. ఎవరిలో ఎలా కలుగుతుందో ఎవరూ అంచనా వేయలేదు. అయితే ఇలా పుట్టిన ప్రేమను చాలామంది పెళ్లిదాకా తీసుకెళ్లలేరు. కొందరు సీరియస్ గానే ప్రేమించినప్పటికీ.. అనేక రకాలైన ఇబ్బందులు వారిని ముందుకు వెళ్లకుండా చేస్తాయి. మరికొందరు ప్రేమను టైంపాస్ వ్యవహారంగా మార్చుకుంటారు. అందువల్ల ఆ ప్రేమ అక్కడితోనే ఆగిపోతుంది. నేటి కాలంలో చాలా వరకు ప్రేమలు శారీరక అవసరాలు తీర్చే వాటిగానే మారిపోతున్నాయి. అందువల్లే ఇప్పటి ప్రేమలు ఎక్కువకాలం నిలబడలేక పోతున్నాయి. అయితే ఒక ఖైదీ, జైలర్ మధ్య ప్రేమ ఏర్పడింది. అది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఖైదీని జైలు అధికారి పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన అక్కడ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 2007లో ఒక హత్య జరిగింది. ఈ కేసులో ధర్మేంద్ర అనే వ్యక్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. సత్న జైలులో అతడు శిక్ష అనుభవించడం మొదలుపెట్టాడు. ధర్మేంద్రకు జైలు అధికారి ఫిరోజాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. 14 సంవత్సరాల అనంతరం ధర్మేంద్రకు న్యాయస్థానం స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించింది.. అతడు సత్ప్రవర్తనను కొనసాగించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. ఈనెల 5న ధర్మేంద్ర, ఫిరోజా పెళ్లి చేసుకున్నారు. మతాలు వేరు కావడంతో ఫిరోజా తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. విశ్వహిందూ పరిషత్ నేతలు ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు.