Rashmika Mandanna: ‘రష్మిక మందన్నా’ రానున్న రోజుల్లో రాజకీయాల్లోనూ సంచలనాలు నమోదు చేసోంది అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్త పై తాజాగా సోషల్ మీడియాలో ఇప్పుడు రకరకాల కథనాలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. రష్మిక తనకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ పదవికి పోటీ చేయబోతుందట. పైగా ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే, ఎంత మంచి గుర్తింపు తెచ్చుకుందో.. రాజకీయాల్లో కూడా అంతకు మించిన గుర్తింపు సంపాదించుకుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరి వేణు స్వామి చెప్పినట్టుగానే రష్మిక నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తోందా ?, అలా ఇచ్చి చేతులారా తన సినీ కెరీర్ ను రష్మిక నాశనం చేసుకుంటుందా ? డౌటే. పైగా ఈ మధ్య పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రమోట్ అయిన ఆనందంలో ఉంది రష్మిక. దీనికితోడు ఆమె రోజురోజుకు మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేసేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో అసలు తగ్గేదే లే అంటుంది.
ఫలితంగా ‘రష్మిక మందన్నా’ క్రేజ్ రెట్టింపు అవుతూనే ఉంది. అన్నిటికీ మించి బాలీవుడ్ లో ఆమెకు భారీ ఫాలోయింగ్ బిల్డ్ అవుతుంది. ఎలాగూ ఆలియా భట్ పెళ్లి చేసుకుంది. త్వరలో తల్లి కాబోతుంది. కాబట్టి.. ఆలియా ప్లేస్ ఇప్పుడు ఖాళీ అయింది. ఈ ప్లేస్ కి రష్మిక అయితేనే బాగుంటుంది అని హిందీ మేకర్స్ అనుకుంటున్నారు. పైగా ఆలియా కోసం రాసుకున్న పాత్రలను రష్మిక కు ఇస్తున్నారు.
అందుకే, ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రష్మిక చేతి నిండా సినిమాలు ఉన్నాయి. పైగా ఆమె హిందీలో కూడా భారీ రెమ్యూనిరేషన్ ఒప్పందాలతో ఫుల్ బిజీగా ఉంది. దీనికితోడు ఇంత బిజీలోనూ కాస్త గ్యాప్ తీసుకుని ప్రేమ కథనూ సాగిస్తున్నట్టుగా రష్మిక పై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందనే పుకారు షికారు చేస్తూనే ఉంది.
అయితే వీరిద్దరూ తమ ప్రేమబంధాన్ని ఇంతవరకు ధ్రువీకరించలేదు. కానీ రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతుంది అని గత కొన్ని నెలలుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ పుకార్లలలో నిజాలు సంగతి పక్కన పెడితే.. వీరి మధ్య అయితే.. ఏదో వ్యవహారం జరుగుతున్న మాట వాస్తవం.