Viral: వారికి క్రికెట్ అంటే ప్రాణం. దాని కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. తమ జట్టు సభ్యులను కాపాడుకునే క్రమంలో వారి నుంచి బేషరతుగా హామీ తీసుకుని మరీ ఆటను కాపాడుకోవాలని భావించారు. వారికున్న కోరికను చూసి అందరు అవాక్కయ్యారు. ఏదో నామ్ కే వాస్తే గా ఆడుతున్న ఆటలున్నా క్రికెట్ కు ఉన్న ఇమేజ్ అందరికి తెలుసు. అందుకే వారు క్రికెట్ నే తమ ప్రాణంగా భావించి జట్టు సభ్యులను కూడా దూరం చేసుకోకుండా ఉండేందుకు వారు ఓ వినూత్నమైన ప్రణాళిక వేశారు. దీంతో వారికొచ్చిన ఆలోచనకు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తాజాగా తమిళనాడులోని కీలాపూడూర్ లో హరిప్రసాద్ తేనీలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేస్తున్నాడు. అతడు సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడికి ఇటీవల మధురైకి చెందిన పూజతో వివాహం కుదిరింది. పెళ్లయితే తమ స్నేహితుడు ఆటకు దూరమవుతాడేమోననే ఆందోళన వారిలో వచ్చింది. దీంతో వారికి ఓ ఆలోచన వచ్చింది. తమ స్నేహితుడిని ఆటకు దూరం కాకుండా ఉండాలని ఓ షరతు విధించారు. పెళ్లి వారికి వారు చేసిన దానికి ఎంతో ఆశ్చర్యం కలగడం సహజమే.
శుక్రవారం వీరి వివాహం జరుగుతుండగా స్నేహితులు వచ్చి తమ స్నేహితుడు పెళ్లి తరువాత కూడా ఆట ఆడాలని కోరారు. దానికి పెళ్లి కూతురు సరేనని చెప్పింది. కానీ మాకు మాటతో కాకుండా పేపర్ మీద రాసి ఇవ్వాలని సూచించగా వారు ఏదో ఆట పట్టించడానికి అడుగుతున్నారని అనుకుంది. వారు నిజంగానే బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలని రూ.20 ల బాండ్ పేపర్ తీసుకురావడంతో వధువు దాని మీద సంతకం చేసి ఇచ్చింది. వారాంతంలో శని, ఆదివారాలు కచ్చితంగా ఆట ఆడేందుకు పంపించాలని దాని మీద రాసి ఆమెతో సంతకం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదివరకు చాలా మంది పెళ్లి తరువాత ఆటను వదిలేశారు. దీంతో ఆ ప్రమాదం రాకూడదనే ఉద్దేశంతో వారు ఈ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. స్నేహితులు చేసిన పని కొత్తగా ఉండటంతో పెళ్లివారు కూడా గమ్మత్తుగా ఉందని చర్చించుకున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ అవుతోంది. స్నేహితులు తమ ఆట కోసం ఇంతలా తపించడం చూసిన వారికి ముచ్చట గొలిపింది. క్రికెట్ ఆటంటే వారికి ఎంత ఇష్టమో గ్రహించిన నవ వధువు వారికి సంతకం చేసి ఇవ్వడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మా ఆయనను వీకెండ్ లో క్రికెట్ ఆడేందుకు పంపిస్తానని ఆమె స్వయంగా సంతకం చేసి ఇవ్వడంతో వారికి క్రికెట్ ఆటపై ఉన్న మక్కువకు ముక్కున వేలేసుకున్నారు.