spot_img
Homeజాతీయ వార్తలురజనీ రాజకీయ అరంగేట్రం.. మళ్లీ అదే సస్పెన్స్

రజనీ రాజకీయ అరంగేట్రం.. మళ్లీ అదే సస్పెన్స్

Rajinikanth

తమిళ సూపర్‌‌ స్టార్‌‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నారా.. లేదా అనే దానిపై ఇంకా సస్పెన్స్‌ వీడడం లేదు. దీనిపై ఫ్యాన్స్‌తో చర్చించి సోమవారం ఫైనల్‌ నిర్ణయం ప్రకటించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ‘రజనీ మక్కళ్ మండ్రం’ నిర్వాహకులతో కీలక భేటీ నిర్వహించారు. స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ భేటీ పెట్టారు.

Also Read: గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌!

అయితూ.. ప్రధానంగా రాజకీయాల్లోకి వచ్చే అంశంపైనే ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయాలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని మరోసారి రజినీకాంత్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. మరోసారి రాజకీయాలపై వాయిదా వేశారు. రజనీ నేటి భేటీతో ఆయన ఇంటి ముందు అభిమానులు ముందుగానే పెద్ద ఎత్తున పోటెత్తారు. రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.

Also Read: హైదరాబాద్ లో రోహింగ్యాల వేట మొదలైంది..

మరోవైపు.. తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రజనీ పార్టీ నిర్వాహకులతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయాల్లోకి వచ్చే విషయమై డిసెంబర్‌‌ 12న తన పుట్టిన రాజు నాడు కీలక ప్రకటన వెలువడచ్చనే ప్రచారమూ ఊపందుకుంది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా పోటీ చేస్తారని అభిమానులూ వాపోతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం: జాతీయం

గతంలోనూ రజనీ రాజకీయ అరంగేట్రంపై చాలాసార్లు ప్రచారం జరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తానని మూడేళ్ల క్రితమే ప్రకటించినా.. ఇప్పటివరకు పార్టీని మాత్రం ప్రారంభించలేదు. అటు క్రియాశీల రాజకీయాల్లోనూ పాల్గొనలేదు. అదే సమయంలో మక్కల్‌ మండ్రం బలోపేతానికి మాత్రం చర్యలు చేపట్టారు. తరచూ జిల్లాలవారీగా నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. అయితే.. ఇప్పుడైన తన రాజకీయ అరంగేట్రంపై పూర్తిస్థాయి క్లారిటీ ఇస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Oktelugu Epaper