Homeజాతీయ వార్తలుAP Congress: విజయ్ ద్వారా ఏపీలో కాంగ్రెస్ గట్టి ప్లాన్

AP Congress: విజయ్ ద్వారా ఏపీలో కాంగ్రెస్ గట్టి ప్లాన్

AP Congress:  తమిళనాడులో( TamilaNadu ) పరిణామాలతో ఏపీ రాజకీయాలపై ఒక క్లారిటీ వస్తోంది. ఏపీలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. మెజారిటీకి కూత వేటు దూరంలో విజయ్ మిగిలిపోగా.. బాహటంగా మద్దతు తెలిపింది కాంగ్రెస్ పార్టీ. దశాబ్దాలుగా డీఎంకేతో ఉన్న స్నేహాన్ని వదులుకుంది విజయ్ కోసం. భవిష్యత్తులో కూడా విజయ్ తోనే ప్రయాణం అన్నట్టు సంకేతాలు ఇస్తోంది ఆ పార్టీ హై కమాండ్. అయితే విజయ్ కు ఉన్న ఇమేజ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా బే షరతుగా తమిళనాడులో మద్దతు ఇస్తున్న కాంగ్రెస్.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విజయ్ సాయం తీసుకోవాలని చూస్తోంది. ఇది ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామమే. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు విజయ్ చేరదీయడం.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తానని చెబుతుండడం మాత్రం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతోంది.

* కాంగ్రెస్ బలోపేతం..
ఏపీలో( Andhra Pradesh) టీవీ కే విస్తరణ కంటే.. కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై విజయ్ దృష్టి పెడతారన్న ప్రచారం నడుస్తోంది. విజయ్ కు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇమేజ్ కూడా ఉంది. రీమేక్ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు విజయ్. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో రీమేక్ అవుతూ వస్తోంది. కొన్ని సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. కలెక్షన్ల పర్వం కూడా ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తమిళనాడులో దశాబ్దాల స్నేహాన్ని డీఎంకేతో వదులుకొని తనతో చేయడానికి విజయ్ సైతం కృతజ్ఞతా భావంతో ఉన్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటారు విజయ్. అందుకే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానని హై కమాండ్ కు హామీ ఇచ్చినట్లు సమాచారం.

* ఆ వర్గం పై ఫోకస్..
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం పాలించింది ఆ పార్టీ. తమిళనాడులో స్వాతంత్ర్య అనంతరం ఒక మూడు సార్లు మాత్రమే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. తరువాత అక్కడ ప్రాంతీయ పార్టీల హవా నడిచింది. అయితే ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ బలోపేతం కంటే తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి చాటుకోవడమే మేలు. తెలంగాణ కంటే ఏపీలో క్రిస్టియన్ వర్గం ఎక్కువ. దళిత సామాజిక వర్గం కూడా అధికమే. దశాబ్దాలుగా ఆ వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ వచ్చేది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయింది. మొన్నటి ఎన్నికల్లో మాత్రం చీలిపోయింది. అందుకే విజయ్ ను ప్రయోగించి ఆ వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలన్నది పెద్దల అభిమతం. అదే జరిగితే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అయితే తమిళనాడులో అధికారం చేపట్టిన తర్వాత విజయ్ తో ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular