Homeజాతీయ వార్తలుVijay CM Hopes Setback: బిగ్ బ్రేకింగ్ : విజయ్ సీఎం ఆశలపై నీళ్లు జల్లిన...

Vijay CM Hopes Setback: బిగ్ బ్రేకింగ్ : విజయ్ సీఎం ఆశలపై నీళ్లు జల్లిన స్టాలిన్.. చివరి నిమిషంలో ఊహకందని ట్విస్ట్..

Vijay CM Hopes Setback: రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు , ఎంత దారుణానికి అయినా దిగజారోచు , నీతి , నిజాయితీ వంటివి ఏమి ఉండవు అనేది గతం లో ఎన్నోసార్లు జరిగాయి. మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటివి చాలానే చూశాము. కానీ తమిళనాడు రాజకీయాలు , మన రాజకీయాలతో పోలిస్తే అత్యంత నీచంగా , దారుణంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఇప్పుడు తాజాగా తమిళనాడు లో చోటు చేసుకుంటున్న పరిణామాలు […]

Vijay CM Hopes Setback: రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు , ఎంత దారుణానికి అయినా దిగజారోచు , నీతి , నిజాయితీ వంటివి ఏమి ఉండవు అనేది గతం లో ఎన్నోసార్లు జరిగాయి. మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటివి చాలానే చూశాము. కానీ తమిళనాడు రాజకీయాలు , మన రాజకీయాలతో పోలిస్తే అత్యంత నీచంగా , దారుణంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఇప్పుడు తాజాగా తమిళనాడు లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ టీవీకే పార్టీ ఘనవిజయం సాధించి, రాష్ట్రంలో సింగిల్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించిన సంగతి తెలిసిందే. కానీ మెజారిటీ సీట్లు రాలేదు. చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని అనుకున్నాడు .

విజయ్ పిలుపుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది, కానీ వామపక్షాలు , ఇతర చిన్న పార్టీలు మాత్రం మేము డీఎంకే నుండి బయటకు వచ్చే సమస్యే లేదు అని తేల్చి చెప్పాయి. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అంతా అనుకుంటున్నా సమయంలో , కాసేపటి క్రితమే అసలు సిసలు ట్విస్ట్ బయటపడింది. DMK పార్టీ , అన్నా DMK పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లేకుండా, ఈ రెండు కూటములకు సంబంధించిన పార్టీలకు వచ్చిన సీట్లు అన్ని కలిపితే 121 వరకు ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 118 సీట్లు మాత్రమే అవసరం. విజయ్ తో కాంగ్రెస్ తప్ప, ఎవ్వరూ కూడా కలిసేందుకు ఆసక్తి చూపకపోవడం తో, ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే , ఈ రెండు పార్టీలకు ఇదే చివరి ఎన్నికలు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

ఉంటే నువ్వు అధికారం లో ఉండాలి, లేదంటే నేను అధికారం లో ఉండాలి, మధ్యలో ఎవరో వచ్చి మన మీద కూర్చోవడం ఏంటి అనే సిద్ధాంతం తో ఈ రెండు పార్టీలు ముందుకు వెళ్ళబోతున్నాయి. దీన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించే అవకాశం లేదు. కర్ణాటక లో ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు , అక్కడి గవర్నర్ మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోకపోయినా అత్యధిక సీట్లు వచ్చిన పార్టీ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిని ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం గవర్నర్ ఒప్పుకోవడం లేదు.. చూస్తుంటే ఇది విజయ్ పై గవర్నర్ కక్ష్య సాధింపు చర్యలాగా అనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం లో విజయ్ , అధికారం లోకి రాగానే గవర్నర్ ని పీకేసే చట్టం తెస్తాను అని ఒక స్టేట్మెంట్ జారీ చేశాడు . అది మనసులో పెట్టుకున్న గవర్నర్ నేడు తన పవర్ ని చూపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో విజయ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper