మహా చెడ్డ పాలకుడిగా ముద్ర పడిన ట్రంప్‌

అమెరికా అంటే ప్రపంచ దేశాలకు పెద్దన్నలాంటిది. అందుకే.. అది అగ్రదేశం. ఈ అగ్రదేశంపై నిన్నామొన్నటి వరకూ ప్రపంచ దేశాల్లో ఓ రకమైన గౌరవ ప్రదమైన భావన ఉండేది. అన్ని దేశాల ప్రజలు ఉండే దేశమని..ప్రతిభ ఉన్న వాళ్లకు అవకాశాల స్వర్గమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ.. అది నాలుగేళ్ల కిందటి వరకే. నాలుగేళ్లలో ఆ దేశం పరిస్థితి దిగజారిపోయింది. ఆఫ్రికాలోని కల్లోలిత దేశాలకూ.. అమెరికాకూ పెద్దగా తేడా లేదన్నట్లుగా మారిపోయింది. క్యాపిటల్ భవనంలో రగడ.. కాల్పులు.. నలుగురు చనిపోవడం.. […]

Written By: Srinivas, Updated On : January 8, 2021 2:06 pm
Follow us on


అమెరికా అంటే ప్రపంచ దేశాలకు పెద్దన్నలాంటిది. అందుకే.. అది అగ్రదేశం. ఈ అగ్రదేశంపై నిన్నామొన్నటి వరకూ ప్రపంచ దేశాల్లో ఓ రకమైన గౌరవ ప్రదమైన భావన ఉండేది. అన్ని దేశాల ప్రజలు ఉండే దేశమని..ప్రతిభ ఉన్న వాళ్లకు అవకాశాల స్వర్గమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ.. అది నాలుగేళ్ల కిందటి వరకే. నాలుగేళ్లలో ఆ దేశం పరిస్థితి దిగజారిపోయింది. ఆఫ్రికాలోని కల్లోలిత దేశాలకూ.. అమెరికాకూ పెద్దగా తేడా లేదన్నట్లుగా మారిపోయింది. క్యాపిటల్ భవనంలో రగడ.. కాల్పులు.. నలుగురు చనిపోవడం.. ఓ రకంగా..సివిల్ వార్ ను తలపించింది. దాన్ని పెంచి పోషించింది ఇప్పటి వరకు కొనసాగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే అన్నది అందరికీ తెలిసిందే.

Also Read: ట్రంప్‌కు ఉద్వాసన తప్పదా..?

ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం విభజించు పాలించు అన్న సిద్ధాంతం మీదనే నడిచింది. అమెరికన్లలో ఒకరిపై ఒకరికి విభేదాలు సృష్టించి గెలిచారు. తర్వాత అమెరికన్లకు అది నచ్చలేదు. ఓడించారు. దీన్ని అంగీకరించలేకపోతున్న ట్రంప్.. తాను ఏ వ్యవస్థ మీద అయితే ఆధారపడి అధ్యక్షుడిని అయ్యాడో.. అదే వ్యవస్థపై తిరగబడి ఓడినా గెలవాలనుకున్నాడు. అమెరికాను ఫూల్ చేయాలనుకున్నాడు. కానీ.. అమెరికాను ఫూల్ మాత్రమే కాదు అంతకు మించి చేశాడు. పోతూ పోతూ అమెరికాను తనతోపాటు పాతాళానికి తీసుకెళ్తున్నాడు.

పాలకుడు చెడ్డవాడయితే వ్యవస్థలను సైతం నిర్వీర్యం చేసి.. తానే ఓ నియంతలా మారాలని అనుకుంటే.. దేశం ఏమైపోయినా పట్టించుకోడు. తన బాగు తన వారి బాగు మాత్రమే చూసుకుంటారు. ఇది ట్రంప్ విషయంలో స్పష్టమయింది. ప్రజలు భావోద్వేగాలకు గురై ఓట్లు వేస్తే.. ట్రంప్ లాంటి పాలకుడు వస్తాడు. అన్ని రకాలుగా ప్రజల్లో విభజన తెస్తాడు. చివరికి దేశానికే చెడ్డపేరు తెస్తాడు. ట్రంప్ వ్యవహారం.. ఒక్క అమెరికన్లకే కాదు.. ప్రపంచ దేశాల ప్రజలందరికీ గుణపాఠం.

Also Read: ప్రపంచ కుబేరుడు ఎవరో తెలుసా..?

ట్రంప్‌ మొత్తంగా తన రాజకీయ భవిష్యత్తును కూడా దిగజార్చుకున్నారనే చెప్పొచ్చు. అమెరికాలో రాజకీయ భవిష్యత్‌ లేకుండా తన చేజేతులారా నాశనం చేసేసుకున్నారు. అటు నియంత పోకడ.. ఇటు గుండాయిజం రాజకీయాలు వెరసి.. అగ్రరాజ్యం పరువు ప్రతిష్టను దిగజార్చారు. చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో చట్టసభపై దాడులు చేయించడం ఆయనకే చెల్లింది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు