Site icon OkTelugu

Donald Trump 2026 strategy : నెలకో టార్గెట్‌.. మూడు నెలల్లో మూడు దేశాలపై దాడులు.. తర్వాతి టార్గెట్‌!?

Donald Trump 2026 strategy

Donald Trump 2026 strategy : అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌.. 2026లో నెలకొకరనిని టార్గెట్‌ చేస్తున్నాడు. ఏడాది పాలన పూర్తి కావడంతో తనలోని యుద్ధ కాంక్షను బయటపెట్టిన ట్రంప్‌ అమెరికా ప్రయోజనాల కోసం యుద్ధం చేస్తున్నాడు. యుద్ధాలు ఆపుతానని గద్దెనెక్కిన నేత.. జరుగుతున్న యుద్ధాలు ఆపకుండా.. కొత్త యుద్ధాలు మొదలు పెట్టాడు. జనవరి నుంచి మార్చి 1 వరకు ముగ్గురిని టార్గెట్‌ చేశాడు.

వెనెజువెలాపై సైలెంట్‌ ఆపరేషన్‌..
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ట్రంప్‌ ఈ ఏడాది జనవరిలో టార్గెట్‌ చేశాడు. వెనెజువెలాలోని ఆయిల్‌ నిల్వల కోసం ఆ దేశ అధినేతను సైలెంట్‌గా కిడ్నాప్‌ చేయించాడు. ఇక తమ దేశంలోకి డ్రగ్స్‌ అక్రమంగా సరఫరా చేస్తున్నాడని మెక్సికోకు చెందిన లార్డ్‌ ఎల్‌ మెంచోను ట్రాప్‌ చేసి ఫిబ్రవరిలో హతమార్చాడు. ప్రియురాలును ట్రాప్‌ చేసి మెంచోను హతమార్చారు. ఇక తాజాగా ఇరాన్‌ టాప్‌ లీడర్‌ ఖమేనీని మట్టుబెట్టాడు. అణ్వాయుధాలు తయారు చేస్తున్నాడన్న సాకుతో ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు చేశాడు. చివరకు హతమార్చాడు.

యుద్ధం వెనుక రహస్యాలు
ఈ టార్గెట్లు రాజకీయ, డ్రగ్స్, మతపరమైన తీవ్రవాదానికి చిహ్నాలు. అమెరికా ఇప్పుడు ’హిట్‌ లిస్ట్‌’ రక్షణ, వాణిజ్య ఆధారాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెడుతోంది. ఈ వ్యూహం ద్వారా వాసింగ్టన్‌ తన ప్రభావాన్ని పునరుద్ధరిస్తూ, ప్రత్యర్థులకు హెచ్చరికలు జారుస్తోంది.

తర్వాతి లక్ష్యాలు..
ఇక ట్రంప్‌ తర్వాతి లక్ష్యం ఉత్తర కొరియా అని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్‌ అణు కార్యకలాపాలు, మిస్సైల్‌ పరీక్షల కారణంగా దాడి చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాపైనా దాడికి అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. రష్యాపై సైబర్‌ దాడులకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇక తర్వాతి లక్ష్యం చైనా. చైనా – తైవాన్‌ ఉద్రిక్తతలు, దక్షిణ చైన సముద్రం వివాదాలు లక్ష్యంగా మారవచ్చు. మధ్యప్రాచ్యంలో హమాస్, హిజ్బుల్లా సంబంధాలు కొత్త టార్గెట్లకు దారి తీస్తాయి.

అమెరికా దుందుడుకు చర్యలతో మిత్రరాజ్యాలకు ఇబ్బందులు లేకపోయినా.. ప్రత్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి విమర్శలు, వాణిజ్య యుద్ధాలు పెరిగే ప్రమాదం ఉంది. అమెరికా ఈ మార్గంలో స్వయం రక్షణను సాకుగా చూపుతోంది.

Exit mobile version