Site icon OkTelugu

USA Israel Iran Military Power Analysis: ఇరాన్‌ వార్‌.. ఎవరి సైనిక శక్తి ఎంత?

USA Israel Iran Military Power Analysis

USA Israel Iran Military Power Analysis

USA Israel Iran Military Power Analysis: ఇరాన్‌పై అమెరికా యుద్ధం మొదలు పెట్టింది. నెలకుపైగా చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. దీంతో అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై వార్‌ మొదలు పెట్టాయి. బాంబుల మోతతో ఇరాన్‌ మార్మోగుతోంది. మరోవైప ఇరాన్‌ కూడా ఇస్లామిక్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. యుద్ధం మొదైలన 24 గంటల్లోనే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతిచెందాడు. దీంతో మూడు దేశాల సైనిక శక్తిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

అమెరికాకు విస్తృత సైనిక శక్తి..
ప్రపంచంలో సైనిక శక్తిలో అగ్రరాజ్యం అమెరికా ముందు ఉంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 128 స్థావరాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో 40వేల మంది సైనికులు ఉన్నారు. ఇటీవల జెరాల్డ్‌ ఆర్‌. ఫోర్డ్, యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ విమానవాహక నౌకలు, F–18, F–35 జెట్లు, F–2 నిఘా విమానాలు తరలించారు. ప్రతి క్యారియర్‌ గ్రూప్‌లో మూడు మిసైల్‌ డిస్ట్రాయర్లు ఉన్నాయి. THAAD, ప్యాట్రియట్‌ గగనతల రక్షణ వ్యవస్థలు.

విదేశాల్లో స్థావరాలు..
బహ్రెయిన్‌లోని జుఫైర్‌ (5వ ఫ్లీట్‌ HQ) మైన్‌ కౌంటర్‌ నౌకలు ఉన్నాయి. ఇక్కడ 8 విమానాలు,9 వేలమంది సైనికులు ఉన్నారు. ఖతార్‌లోని అల్‌ ఉదైద్‌ ఎయిర్‌ బేస్‌లో యుద్ధ ట్యాంకులు, 10 వేల మంది సైనికులు ఉన్నారు. కువైట్‌లో క్యాంప్‌ అరిఫ్‌జాన్‌ ఉంది. లాజిస్టిక్స్, MQ–9 డ్రోన్లు, వేల మంది సైనికులు ఉన్నారు. యూఏఈలో అల్‌ ధాఫ్రా ఎయిర్‌ బేస్‌ ఉంది. ఇక్కడ 380వ ఎయిర్‌ వింగ్, F–22లు, వేల మంది సైనికులు ఉన్నారు. ఇరాక్‌లోని అయిన్‌ అల్‌ అసద్‌బేస్‌లో అపాచీ హెలికాప్టర్లు, డ్రోన్లు, 2,500 మంది సైనికులు ఉన్నారు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ బేస్‌లో ప్యాట్రియట్, THAAD వ్యవస్థలు, 2,500 మంది సైనికులు ఉన్నారు. జోర్డాన్‌లోని మువాఫాక్‌ సల్తీ బేస్‌లో F–35 జెట్లు, 332వ ఎయిర్‌ వింగ్, 3 వేల మంది సైనికులు ఉన్నారు.

ఇరాన్‌ సైనిక బలం
ఇరాన్‌లో 6.1 లక్షల క్రియాశీల సైనికులు, 2 లక్షల IRGC దళం, 2వేల ట్యాంకులు, 1500 రాకెట్‌ లాంచర్లు ఉన్నాయి. 3000+ బాలిస్టిక్‌ క్షిపణులు (సెజ్జిల్‌ 2000 కి.మీ., ఖైబర్‌ షెకన్‌ 1300 కి.మీ.) ప్రముఖం. వాయుసేనలో 551 పాత విమానాలు, డ్రోన్లు, జలాంతర్గాములు ఉన్నాయి. ఫాస్ట్‌ యాటాక్‌ క్రాఫ్ట్‌లతో హోర్ముజ్‌ జలసంధిని మూసేయగల సామర్థ్యం ఉంది. దేశీయ ఆయుధాలపై ఆధారపడి సంఖ్యాబలంతో పోరాడుతుంది.

ఇజ్రాయిల్‌ సైనిక సామర్థ్యం
1.7 లక్షల సైనికులు, 4.65 లక్షల రిజర్వులతో ఇజ్రాయిల్‌ ఆధునిక సాంకేతికతపై ఆధారపడుతుంది. 600 యుద్ధవిమానాలు (F–35, F–16లు), ఐరన్‌ డోమ్, డేవిడ్‌ స్లింగ్, యారో వ్యవస్థలు రక్షణ బలం. జెరికో–3 (6500 కి.మీ.) క్షిపణులు, 90+ అణ్వాస్త్రాలు, స్పైక్, లాయరా మిసైళ్లు దాడి సామర్థ్యం అందిస్తాయి. నెట్‌వర్క్‌ ఆధారిత యుద్ధ వ్యవస్థలు ప్రత్యర్థిని మించుతాయి.

అమెరికా–ఇజ్రాయిల్‌ అధునాతన ఆయుధాలు, గాలి–సముద్ర ఆధిపత్యంతో ఇరాన్‌ సంఖ్యాబలాన్ని అధిగమిస్తాయి. ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్‌ దాడులతో ప్రతీకారం తీర్చుకోవచ్చు, హోర్ముజ్‌ మూసివేత ఆర్థిక దెబ్బ తగిలే అవకాశం ఉంది.

Exit mobile version