Site icon OkTelugu

Mohan Babu School Student Actress: మోహన్ బాబు స్కూల్ లో చదువుకున్న ఒక అమ్మాయి..ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోయిన్.. ఎవరో చెప్పగలరా?

Mohan Babu School Student Actress

Mohan Babu School Student Actress

Mohan Babu School Student Actress: హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వందల సినిమాల్లో నటించి లెజండరీ స్థానాన్ని సంపాదించుకున్న మోహన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది . నటుడిగా ఆయన సినీ ప్రస్థానం లో దేశం లోనే అత్యుత్తమ ప్రస్థానాల్లో ఒకటి. స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత ఎలాంటి పాత్రని అయినా అలవోకగా చేయగలిగే హీరోగా మోహన్ బాబు కి మంచి పేరుంది . ఈ విషయాన్ని ఆయన కూడా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. ఎన్నో సంచలనాత్మక చిత్రాలను నిర్మించిన చరిత్ర ఆయన సొంతం . అంతే కాకుండా తిరుపతి లో శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ ని ప్రారంభించాడు. మొదట్లో స్కూల్ గా మొదలైన ఈ సంస్థ, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ విద్యని కూడా అందించే స్థాయికి ఎదిగింది.

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

నేడు మోహన్ బాబు విశ్వ విద్యాలయం గా పేరు తెచ్చుకొని , దేశం లోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీలలో ఒకటిగా నిల్చింది. అయితే ఈ యూనివర్సిటీ ఇప్పుడు ఎన్ని ఆరోపణలను ఎదురుకుంటుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కోర్టు లో కేసు కూడా నడుస్తోంది. అది కాసేపు పక్కన పెడితే మోహన్ బాబు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన యూనివర్సిటీ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ యూనివర్సిటీ లో చదువుకుకున్న ఒక అమ్మాయి, ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పెద్ద టాప్ హీరోయిన్ అయ్యిందని, సమయానికి ఆమె పేరు గుర్తుకు రావడం లేదంటూ చెప్పుకొచ్చాడు. మోహన్ బాబు చెప్పిన ఆ అమ్మాయి మరెవరో కాదు, ఐశ్వర్య రాజేష్. ఈమె ప్రముఖ సినీ నటి శ్రీ లక్ష్మి కి మేనకోడలు. అంతే కాకుండా రాజేష్ అనే సీనియర్ హీరో కూతురు కూడా. ఐశ్వర్య రాజేష్ చిన్నతనం లో ఉన్నప్పుడే రాజేష్ చనిపోయాడు.

బాల్యం లో మోహన్ బాబు స్కూల్ లో విద్యాబ్యాసం చేసిన ఐశ్వర్య రాజేష్ , ఆ తర్వాత తన కుటుంబం తో చెన్నై లో స్థిరపడింది. పెరిగి పెద్దయ్యాక సినీ రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తమిళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి పెద్ద స్టార్ గా మారిపోయింది. ఇక తెలుగు లో ఈమె వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్ , రిపబ్లిక్ మరియు సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాల్లో నటించింది. వీటిల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ అనే చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ప్రభంజనం సృష్టించింది.

Exit mobile version