Site icon OkTelugu

Operation Epic Fury: ఇరాన్‌పై రెజీమ్‌ చేంజ్‌ ఆపరేషన్లు.. అమెరికా ’ఎపిక్‌ క్యూరీ’, ఇజ్రాయెల్‌ ’లయన్‌ రోర్‌’

Operation Epic Fury

Operation Epic Fury

Operation Epic Fury: అగ్రరాజ్యం అమెరికా అన్నంత పని చేసింది. ఇరాన్‌ను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి దాదపు నెల రోజులుగా యుద్ధం తప్పదు అంటూ హెచ్చరికలు చేశారు. ఇరాన్‌తో చర్చలు కూడా జరిపారు. కానీ చివరకు చర్చలు విఫలమయ్యాయని యుద్ధం మొదలు పెట్టారు. ఇజ్రాయెల్‌తో కలిసి మిసైళ్లతో విరుచుకుపడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యుద్ధానికి ముందు 8 నిమిషాల ప్రకటనలో ఇరాన్‌ ప్రస్తుత పాలనను పడగొట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్నే లక్ష్యంగా పేర్కొన్నారు. ఆపరేషన్‌ ఎపిక్‌ క్యూరీ పేరుతో ఇరాన్‌ రెజీమ్‌ను మార్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ సింహగర్జన (లయన్‌ రోర్‌) ఆపరేషన్‌తో ఇదే లక్ష్యాన్ని సాధించాలని ప్రకటించింది. ఇరాన్‌ కూడా తన ప్రతిఘటనకు ఆపరేషన్‌ అల్‌ తుఫాన్‌గా పేరు పెట్టింది.

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

అమెరికా బేస్‌లను టార్గెట్‌ చేసిన ఇరాన్‌
ఇరాన్‌ తక్కువ నష్టంతో పెద్ద దాడులు చేస్తోంది. ఒమాన్, ఖతార్, అబుదాబి, దుబాయ్‌ ప్రాంతాల్లో అమెరికా సైనిక కేంద్రాలపై దాడులు. ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థను ఛేదించి స్కూల్స్, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుంది. యూఏఈలో అల్‌ జఫ్రా, అల్‌ బాలూప్‌ ఎయిర్‌బేస్‌లు, కువైట్‌ అల్‌ సలీం, బహ్రెయిన్‌లోని రెండు బేస్‌లపై ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించింది. అమెరికాకు ఆశ్రయం ఇచ్చే దేశాలను బెదిరుతూ ప్రాంతీయ యుద్ధం విస్తరిస్తోంది.

ప్రపంచ దేశాలపై ప్రభావాలు..
యుద్ధం కారణంగా ఆయిల్‌ సరఫరా ఆగిపోయింది, భారతీయులు ఆందోళన

ఇరాన్‌ ఆయిల్‌ రవాణాను పూర్తిగా ఆపేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దుబాయ్, ఖతార్‌లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సూచనలు అందుతున్నాయి. భారత్‌కు తక్కువ ప్రభావం కానీ చైనా, యూరప్‌ దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాయి. అమెరికా నుంచి ఇంధనం కొనుగోలు పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది.

రంజాన్‌ మాసంలో యుద్ధం..
రంజాన్‌ నెలలో జరుగుతున్న ఈ ఘర్షణ పశ్చిమాసియా స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది. పాక్‌–ఆఫ్గాన్‌ యుద్ధంతో కలిపి ప్రాంతం అశాంతంలో మునిగిపోతోంది. అమెరికా ఇరాన్‌ పాలనా మార్పుకు, ఇజ్రాయెల్‌ భద్రతకు, ఇరాన్‌ ప్రతీకారానికి యుద్ధం ఊపందుకుంది. ఆయిల్‌ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపరుస్తున్నారు.

Exit mobile version