పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి ‘రేణూ దేశాయ్’ తన పై తప్పుడు కథనాలు రాసిన వెబ్ సైట్ పై ఫైర్ అవుతున్నారు. ఆ మాటకొస్తే వ్యూస్ కోసం కక్కుర్తి పడి, లేనిపోని గాసిప్ లు క్రియేట్ చేసి అర్ధం పర్ధం లేని ఆర్టికల్స్ తో ప్రముఖులను ఇబ్బంది పెడుతున్న సైట్స్ కూడా, ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి. అయినా, తమ బిజినెస్ కోసం తప్పుడు వార్తల్ని ఎలా ప్రసారం చేస్తారు, అది వృత్తి ధర్మానికే ద్రోహం చేసినట్టు కదా. ఈ విషయాన్ని ఆ తప్పుడు వెబ్ సైట్స్ నిర్వాహకులు ఎప్పుడు అర్ధం చేసుకుంటారో. ఇక రేణు దేశాయ్ ఆ వెబ్ సైట్స్ ని, వాళ్ల ఖాతాలను ఎంకరేజ్ చేయొద్దంటూ తన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో డైరెక్ట్ గా పోస్ట్ చేస్తూ కోరారు.
Also Read: త్రివిక్రమ్ ‘మహాభారతం’… స్టార్ హీరోలే !
ఆమె చేసిన మెసేజ్.. ‘మీకు ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఇలాంటి తప్పుడు ఆర్టికల్స్ ప్రసారం చేసే స్టుపిడ్ వెబ్ సైట్స్ ను ఫాలో కావడం, వాళ్ల వార్తల్ని మనం నమ్మడం మానేయాలి, నేను మీరందర్నీ కోరుతున్నాను. ఈ వెబ్ సైట్ ట్విట్టర్ ఖాతాలో కూడా తప్పుడు కథనాలే వస్తున్నాయి. ఈ స్టుపిడ్ వెబ్ సైట్ అబద్ధాలు, తప్పుడు వార్తలతోనే మనుగడ సాగిస్తోంది. దయచేసి ధృవీకరించబడిన సైట్స్ ను మాత్రమే మీరు నమ్మండి. దయచేసి ఇలాంటి అన్ ఫెయిర్ స్టుపిడిటీ వార్తల్ని నమ్మొద్దు. అభిమానులకు ఏదైనా విషయాన్ని తెలియజేయడానికి సెలబ్రిటీలందరికీ అఫీషియల్ ఖాతాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు కరెక్ట్ సమాచారం అందుతుంది.
Also Read: ‘కేజీఎఫ్ 2’కి కూడా కాపీ బాధలు తప్పట్లేదు !
ఇలాంటి స్టుపిడ్స్ వెబ్ సైట్స్.. సెలబ్రిటీల గురించి అబద్ధాలు చెప్పి.. తప్పుడు కథనాలను ప్రసారం చేయడం ద్వారా ఫాలోవర్స్‌ని పెంచుకుంటారు. నిజాయితీగా పనిచేయరు. దయచేసి ఈ వెబ్ సైట్‌ని ఫాలో కావద్దు.. తప్పుడు వార్తల్ని చూస్తూ వాళ్లకి మరింత వ్యాపారాన్ని ఇవ్వొద్దు’ అంటూ ఆ వెబ్ సైట్ పై ఫైర్ అయింది. ఏమైనా ‘రేణు దేశాయ్’ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సామాజిక సమస్యల పై స్పందిస్తూ ఉంటుంది. కొన్ని విషయాల్లో తన ఆలోచనా విధానంతో మహిళలలకు యువతకు అవగాహన కలిగిస్తూ ఉంటుంది.
https://www.instagram.com/p/CJxawECBQrI/
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్