Site icon OkTelugu

Sanju Samson innings : సంజు శాంసన్.. ఒంటి చేత్తో గెలిపించిన ఈ వీరుడి వెనుక.. ఇంతటి బాధ ఉంది!

Sanju Samson innings

Sanju Samson innings : టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ చేరుకుంది. కీలకమైన మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు మీద అద్భుతమైన విజయాన్ని సాధించింది. వెస్టిండీస్ జట్టు విధించిన 196 పరుగుల విజయ లక్ష్యాన్ని.. టీమిండియా 19.2 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి ఫినిష్ చేసింది. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా కు ఇది అత్యధిక చేదన.

టీమిండియా సాధించిన విషయంలో సంజు (97*) ముఖ్యపాత్ర పోషించాడు. టీమిండియా 199 పరుగులు చేస్తే.. అందులో 97 పరుగులు సంజు శాంసన్ వి కావడం విశేషం. సంజు 50 బంతులు ఎదుర్కొని.. 12 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 97 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10), సూర్య కుమార్ యాదవ్ (18) విఫలమైన చోట సంజు శాంసన్ నిలబడ్డాడు. కఠినమైన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ.. అదరగొట్టాడు.

తిలక్ వర్మ (27) తో కలిసి టీమిండియా పై ఒత్తిడి తగ్గించాడు. ఒకానొక దశలో వికెట్లు పడిపోయిన సందర్భంలో.. సంజు మ్యాచ్ మొత్తాన్ని తన భుజాల మీద మోసాడు. తద్వారా వెస్టిండీస్ జట్టుకు పరాభవాన్ని మిగిల్చాడు.

టీ 20 వరల్డ్ కప్ కంటే ముందు సంజు ఆరు మ్యాచ్ లలో 36 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. జట్టుకు భారం అంటూ చాలామంది అతన్ని తిట్టిపోశారు. దీంతో అతనిలో కసి పెరిగింది. ఫలితంగా ధైర్యంగా నిలబడాలనే తలంపు ను పెంచుకున్నాడు. అందువల్లే కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో బలంగా నిలబడి.. జట్టును గెలిపించాడు…

టీమిండియాలో సంజు శాంసన్ కు 11 సంవత్సరాల కెరియర్ ఉంది. వాస్తవానికి అతడు మైదానంలో ఆడిన మ్యాచులు 60 మాత్రమే. డగ్ అవుట్ లో కూర్చుని చూసిన మ్యాచ్లే చాలా ఎక్కువ.

అతడు చేసిన తప్పులు.. వెంటాడిన దురదృష్టం.. కారణాలు ఏవైనప్పటికీ.. ప్రతి మ్యాచ్ అతడికి వీరమరణమో.. వీర స్వర్గమో అనే పరిస్థితి. అటువంటి ఒత్తిడిలో కూడా సంజు నిలబడ్డాడు. తీవ్రమైన ఒత్తిడిలో ఓపెనర్ గా అదరగొట్టాడు. న్యూజిలాండ్ సిరీస్ లో విఫలమైన సంజు.. వరల్డ్ కప్ తుది జట్టులో అసలు చోటునే కోల్పోయాడు. దీంతో అతని కెరియర్ మొత్తం ముగిసింది అని అనుకున్నారు.

వచ్చిన అవకాశాలను సంజు అనుకూలంగా మార్చుకున్నాడు. అభిషేక్ శర్మ విఫలం కావడంతో రంగంలోకి దిగిన సంజు.. జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. రింకు సింగ్ సరిగ్గా ఆడ లేకపోవడం సంజు శాంసన్ కు అడ్వాంటేజ్ గా మారింది.

Exit mobile version