https://oktelugu.com/

‘వకీల్ సాబ్’ టీజర్ కంటెంట్ లీక్.. అదిరిపోయింది !

పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ టీజర్ మరి కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోందనే సరికి, ఈ టీజర్ ఎలా ఉండబోతోందంటూ పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ టీజర్ ఇలా వుండబోతోంది అంటూ.. కొన్ని ఆసక్తికరమైన విశేషాలు బయటకు వచ్చాయి. టీజర్ లో ముందుగా.. ‘మెట్రో రైలులో హీరో పైట్ సీన్ వుంటుందట. అలాగే పవన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ‘కోర్టులో కోటు వేసుకుని వాదించగలను, కోర్టు […]

Written By:
  • admin
  • , Updated On : January 8, 2021 / 01:53 PM IST
    Follow us on


    పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ టీజర్ మరి కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోందనే సరికి, ఈ టీజర్ ఎలా ఉండబోతోందంటూ పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ టీజర్ ఇలా వుండబోతోంది అంటూ.. కొన్ని ఆసక్తికరమైన విశేషాలు బయటకు వచ్చాయి. టీజర్ లో ముందుగా.. ‘మెట్రో రైలులో హీరో పైట్ సీన్ వుంటుందట. అలాగే పవన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ‘కోర్టులో కోటు వేసుకుని వాదించగలను, కోర్టు బయట కోటు తీసి, వాయించగలను అనే డైలాగ్ కూడా టీజర్ లో మెయిన్ హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

    Also Read: త్రివిక్రమ్ ‘మహాభారతం’… స్టార్ హీరోలే !

    ఇక టీజర్ చివరలో ఓ డిసిఎమ్ వ్యాన్ లో తన సామాను అంతా వేసుకుని పవర్ స్టార్ పడుకుని వెళ్తున్న సీన్ వుంటుందని.. ఈ సీన్ నే గతంలో ఫస్ట్ లుక్ మాదిరిగా వదిలారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా మొత్తం మీద మూడుకు పైగానే ఫైట్లు వుంటాయట. సినిమా ఓపెనింగ్ షాట్ నే ఫైట్ సీన్ అని సమాచారం. ఈ సీన్ లో కంటెంట్ ప్రకారం ‘కాలనీలో అందరూ ఇళ్లు ఖాళీ చేస్తూ వుంటే హీరో మాత్రం చేయకుండా, వివేకానందుడి పుస్తకం చదువుతూ ఉండగా.. రౌడీ వచ్చి హీరోని ఖాళీ చేయమంటూ.. ఆ పుస్తకాన్ని లాక్కుని విసిరేస్తాడట. అప్పుడు హీరో వాడిని లాగిపెట్టి తన్నడంతో వాడు ఎగిరి దూరంగా పడడంతో వచ్చే బిల్డప్ షాట్స్ లో హీరో ఇంట్రడక్షన్ వుంటుందట.

    Also Read: ‘కేజీఎఫ్ 2’కి కూడా కాపీ బాధలు తప్పట్లేదు !

    మొత్తానికి సినిమాలో మంచి యాక్షన్ కూడా ఉండబోతుంది. ఏది ఏమైనా వకీల్ సాబ్ మేకర్స్ మాత్రం టీజర్ విడుదలను పొంగల్ కి ఫిక్స్ చేశారు. మరి పవన్ ఫ్యాన్స్ కి, వకీల్ సాబ్ ఎలాంటి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తాడో చూడాలి. అన్నట్టు ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో ‘వకీల్ సాబ్’ కూడా నిలిచింది. ఇక వకీల్ సాబ్ మరో వారం రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందని… జనవరి 16న నుండి షూట్ మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ షెడ్యూల్ వేశారట. ఆ తరువాత వెంటనే క్రిష్ తో చేస్తోన్న సినిమాను కూడా పవన్ మొదలుపెట్టనున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్