Site icon OkTelugu

AP Anganwadi jobs 2026 : ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. 5 వేల ఉద్యోగాలు!

Anganwadi

AP Anganwadi jobs 2026 : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టింది. అంగన్వాడీ కార్యకర్తలకు సైతం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ఐదువేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు.. అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్లు కల్పించి.. పూర్తిస్థాయి వేతనాలు అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా ఐదు వేల అంగన్వాడి సహాయకులను నియమిస్తామని కూడా చెప్పింది. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలు వీలైనంతవరకు పరిష్కరిస్తామని కూడా చెబుతోంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. సచివాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడిన హోంమంత్రి.. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు.

* మంత్రి ప్రకటన..
ఏపీలో అంగన్వాడీ( Anganwadi) కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేక ప్రకటన చేశారు. దాదాపు 5వేలకు పైగా అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. త్వరలో భర్తీకి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
* రాష్ట్రంలో 257 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 55,746 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
* గతంతో పోల్చుకుంటే అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పెరిగాయి. పౌష్టికాహారం కూడా ఎక్కువగా అందుతోంది.
* రాష్ట్రవ్యాప్తంగా 5వేలకు పైగా అంగన్వాడి సహాయక పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
* జిల్లాల వారీగా వివరాలను సేకరించి అధికారిక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కల్పిస్తోంది.
* అంగన్వాడి కేంద్రాలను కేవలం ఆహార పదార్థాల పంపిణీకి మాత్రమే కాకుండా.. పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Exit mobile version