Homeఆధ్యాత్మికంToday horoscope in telugu .2.3.2026 : ఈ మూడు రాశుల శివుడి ఆశీస్సులు.. కొత్తగా...

Today horoscope in telugu .2.3.2026 : ఈ మూడు రాశుల శివుడి ఆశీస్సులు.. కొత్తగా పెట్టుబడులు పెట్టొచ్చు..

Today horoscope in telugu : జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి మహాశివుడి ఆశీస్సులు ఉండడంతో ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడతాయి. అయితే వీటిని పరిష్కరించుకోవడానికి తెలివిగా ప్రవర్తిస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వీరికి ప్రజల మద్దతు ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఏ వ్యాపారం చేసినా విజయవంతంగా పూర్తి అవుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. అయితే మాటల విషయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ పనులను పూర్తిచేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈరోజు కొన్ని గ్రహాల అనుకూలత లేదు. దీంతో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యాలయాల్లో ఉద్యోగులకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే తోటి వారితో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులకు ప్రత్యర్ధుల బెడద ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు దానధర్మాలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దాని కంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అనవసరంగా ఇతరులతో గొడవలు పడకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. అయితే డబ్బు సహాయం చేస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రాజెక్టులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. తోటి వారి మద్దతు ఉండడంతో సంతోషంగా ఉంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాయమాటలకు నమ్మి మోసపోవద్దు. ఎక్కువగా రిస్కు ఉండే పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాల్సి వస్తే ఈరోజు సరైన సమయం. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడును పెడతారు. వీరికి పెద్దల అండదండలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. ప్రత్యర్థుల బెడద తొలగిపోతుంది. దీంతో సంతోషంగా ఉండగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు పెద్దల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. కొత్తవారిని కలుస్తారు. అయితే వీరితో ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులకు ఇదే అనుకూలమైన సమయం. కత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుభవం ఉన్న వారితో వ్యాపార సలహాలు తీసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. దుబారా ఖర్చుల విషయంలో ఆలోచించాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. కార్యాలయాల్లో అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. కొన్ని రోజులు వెయిట్ చేయడమే మంచిది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయలేక పోతారు. అయితే నిరాశ చెందకుండా ఓపిక ఉండాలి. కొన్ని రోజుల తర్వాత పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version