PRC: ఏపీలో పీఆర్సీ వివాదం రోజురోజుకూ ఇంకా ముదురుతోంది. తగ్గేదేలే అని ఉద్యోగులు అంటుండగా, మరో వైపున ప్రభుత్వం కూడా ఉద్యోగులపైన సానుకూలంగా స్పందించడం లేదు. ఇంకో రెండు రెజుల్లో ఉద్యోగులు వేతనాలు అందుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం విషయం ఎటూ తేల్చడం లేదు.

పాత వేతనాలే చెల్లించాలని, పీఆర్సీ వద్దని ఓ వైపున ఉద్యోగులు అంటున్నారు. మరో వైపున ప్రభుత్వం నూతన పీఆర్సీ ప్రకారమే వేతనాల చెల్లింపు ఉంటుందని అంటోంద. మంత్రి వర్గం ఈ మేరకు ఆమోదం తెలపడం , జీవో రావడం జరిగిపోయింది కూడా. చర్చలకు రావాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులైన మంత్రులు ఆహ్వానిస్తారు. కానీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు చర్చలకు రావడం లేదు.
అలా ప్రతిష్టంభన కొనసా..గుతూనే ఉన్నది. పీఆర్సీ సాధన సమితి సభ్యులు, నాయకులు ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఇకపోతే జనవరి నెల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ట్రెజరీ శాఖ ఉద్యోగులను ఆదేశించింది. అయితే, వారు ఆదేశాలను పట్టించుకోకుండా అలాగా ఉండిపోయారు. దాంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్రెజరీ ఉద్యోగులకు నోటీసులు పంపింది. 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోనే ఈ మేరకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

అయితే, ప్రభుత్వం ఎంతలా హెచ్చరించినప్పటికీ ట్రెజరీ శాఖ ఉద్యోగులు వెనక్కి తగ్గి లేదు. కానీ, ఏమైందో ఏమో తెలియదు. కానీ, ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఆ శాఖ ఉద్యోగులు విధుల్లోకి వచ్చారు. ఆ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వారు వేతనాల ప్రాసెసింగ్ కోసం వచ్చినట్లు సమాచారం.
కొన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు ప్రాసెస్ చేయడం కోసం వారిని ప్రత్యేకంగా ఒప్పించి పిలిపించారనే టాక్. న్యాయస్థానాలు, పోలీస్ శాఖల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల వేతనాలను చెల్లించేలా ట్రెజరీ సిబ్బంది తమ ప్రాసెసింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ ఉద్యోగుల వేతనాలను కూడా చెల్లించేలా చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇందుకోసంగానూ 50 శాతం మంది ట్రెజరీ ఉద్యోగులు హాజరయ్యారని అంటున్నారు.
నిజానికి ప్రతీ నెల 25న ట్రెజరీ ఉద్యోగులు వేతనాలు ప్రాసెస్ చేస్తుంటారు. కానీ, పీఆర్సీ వివాదం నేపథ్యంలో ట్రెజరీ ఉద్యోగుల విధులకు ఆటంకాలు వచ్చాయి. ప్రాసెసింగ్ కొంచెం లేటయింది కూడా. ఇకపోతే పీఆర్సీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదనే వాదన కూడా ఉంది.
[…] Rajamouli: దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తిని చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’ సినిమాతో ఇండియన్ సినిమా అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాడు. ఆయన దర్శకత్వలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ప్రస్తుతం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆయనతో సినిమా చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల నటీనటులు ఎదురు చూస్తున్నారు. ఏదేని చిన్న పాత్ర అయినా సరే ఏళ్ల టైం ఇచ్చేందుకు మేం రెడీ అని అంటున్నారు. కాగా, ఈయనకు కొన్నేళ్ల కిందట ఓ టాలీవుడ్ స్టార్ హీరో నో చెప్పారట. ఆయన ఎవరు? ఇంతకీ అది ఏ సినిమా అనేది తెలుసుకుందాం. […]
[…] Bollywood Crazy Updates: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాడిన పాట విడుదలైంది. కరోనా కారణంగా తన సినిమాలతో అభిమానులకు చేరువ కాలేకపోయాడు సల్మాన్ ఖాన్. ఈ క్రమంలో సొంతంగా ఓ పాట పడి ఇటీవలే విడుదల చేశాడు. ఇందులో తన గత స్మృతులన్నీ వీడియో రూపంలో పెట్టి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. […]