spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Royal Enfield Bikes: ఆ ఊళ్లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు మాత్రమే మిస్ అవుతున్నాయి.....

Royal Enfield Bikes: ఆ ఊళ్లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు మాత్రమే మిస్ అవుతున్నాయి.. ఆరా తీస్తే షాకింగ్ నిజాలు తెలిశాయి..!

Royal Enfield Bikes: ఓ ఇద్దరు యువకులు రోజుకో కొత్త బైక్ తో ఆంధ్రా బోర్డర్ దాటుతున్నారు. కొన్నిరోజులు లైట్ తీసుకున్న పోలీసులకు.. ఓ రోజు డౌట్ వచ్చింది. వాళ్లిద్దరిపై నిఘా ఉంచారు. ఇంకేముంది ఇది కూడా బీదర్ లో ఇసుక చల్లేలాంటి సీనే అని అర్ధమైంది.

సాధారణంగా యువకులకు బైకులంటే పిచ్చి. కొత్తకొత్త బైక్ లపై తిరగాలని కోరుకుంటారు. అందుకే తెలిసిన వారు ఏదైనా కొత్త మోడల్ బైక్ కొంటే.. వెంటనే ఓ రైడేసేస్తారు. అలాంటి ఓ ఇద్దరు యువకులు రోజుకో కొత్త బైక్ తో ఆంధ్రా బోర్డర్ దాటుతున్నారు. కొన్నిరోజులు లైట్ తీసుకున్న పోలీసులకు.. ఓ రోజు డౌట్ వచ్చింది. వాళ్లిద్దరిపై నిఘా ఉంచారు. ఇంకేముంది ఇది కూడా బీదర్ లో ఇసుక చల్లేలాంటి సీనే అని అర్ధమైంది. ఇద్దర్నీ తీసుకెళ్లి.. జైల్లో ఇసుక చల్లే పనికి పెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన మాచర్ల నవీన్ బాబు, అదే ప్రాంతంలోని పాతూరికి చెందిన చల్లా భవానీ శంకర్ స్నేహితులు. ఇద్దరికీ బైకులంటే ఇష్టం. అందులోనూ రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుంటే పిచ్చి.

అలా ఇద్దరూ రోజుకో కొత్త ఎన్ ఫీల్డ్ బైక్ పై ఆంధ్రా బోర్డర్ దాటి.. తెలంగాణకు వెళ్తున్నారు. ఐతే చాలా రోజుల పాటు పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. కానీ ఓ రోజు ఎక్కడో తేడా కొడుతుందని నిఘా ఉంచారు. అసలు నిజం తెలిసి వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చిలకలూరిపేట పట్టణంలో ని సుబ్బయ్యతోటకు చెందిన కనమర్లపూడి పవన్ అనే వ్యక్తి గత నెల 29వ తేదీన రాత్రి 10.00 గంటల సమయంలో తన ఇంటిముందు పెట్టిన తన AP39HU9600 నెంబర్ గల రాయల్ ఎన్ ఫీల్డ్బైక్ ను పార్క్ చేశారు. అలాగే అదే ఇంట్లోని పై పోర్షనులో అద్దెకు ఉంటున్న కొమ్మనబోయిన నాగ అనిల్ కు చెందిన AP39JX2468 రాయల్ ఎన్ ఫీల్డ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో ఇద్దరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ రాజేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కేసు విచారణలో ముద్దాయిలు మాచర్ల నవీన్ బాబు, చల్లా భవాని శంకర్ రెండవ ఆట సినిమాలకి వెళ్ళి , సినిమా మధ్యలో లేచి బయటకు వచ్చేసి పట్టణంలో తిరుగుతూ అనుకూలంగా ఉన్న చోట చూసుకొని రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్ళను మాత్రమే హ్యాండిల్ లాక్ లను విరగ్గొట్టి దొంగతనం చేస్తుంటారని తేలింది. ఆ బైకులను మాచర్ల తీసుకెళ్లి.. అక్కడి నుంచి తెలంగాణ వెళ్లి  విక్రయిస్తుంటారు. పక్కా సమాచారంతో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద రూ.11 లక్షలు విలువైన రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులను స్వాధీనం చేసుకున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Jana Nayagan Collection

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...
Oktelugu Epaper