Homeజాతీయ వార్తలుReal Dhurandhar: అసలైన దురంధరుడు.. దేశం కోసం సర్వం త్యాగం.. అనామకుడిగా మరణం!

Real Dhurandhar: అసలైన దురంధరుడు.. దేశం కోసం సర్వం త్యాగం.. అనామకుడిగా మరణం!

Real Dhurandhar: దురంధర్‌.. పాకిస్తాన్‌లో గూఢచర్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది. రాకార్డులు తిరగరాసింది. రూ.1000 కోట్లకుపైగా రాబట్టింది. ఈ సినిమా నేపథ్యంలో భారతకు చెందిన నిజమైన దురంధరుడు రోషన్‌ లాల్‌ జల్లా స్టోరీ వైరల్‌ అవుతోంది. 1960లో భారత గూఢచారిగా ఆయన చేసిన ధైర్యం.. పట్టుబడిన తర్వాత దేశం పట్టించుకోకపోవడం.. చివరకు అనామకడిగా మరణించాల్సి వచ్చింది. సైఆ్యనికి పాక్‌ కీలక వివరాలు.. కశ్మీర్‌ చెందిన భారత గూఢచారి రోషన్‌ లాల్‌ […]

Real Dhurandhar: దురంధర్‌.. పాకిస్తాన్‌లో గూఢచర్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది. రాకార్డులు తిరగరాసింది. రూ.1000 కోట్లకుపైగా రాబట్టింది. ఈ సినిమా నేపథ్యంలో భారతకు చెందిన నిజమైన దురంధరుడు రోషన్‌ లాల్‌ జల్లా స్టోరీ వైరల్‌ అవుతోంది. 1960లో భారత గూఢచారిగా ఆయన చేసిన ధైర్యం.. పట్టుబడిన తర్వాత దేశం పట్టించుకోకపోవడం.. చివరకు అనామకడిగా మరణించాల్సి వచ్చింది.

సైఆ్యనికి పాక్‌ కీలక వివరాలు..
కశ్మీర్‌ చెందిన భారత గూఢచారి రోషన్‌ లాల్‌ జల్లా, 1960 చివరలో పాకిస్థాన్‌లోకి ధైర్యంగా చొరబడ్డాడు. 1969, 1970, 1971 సంవత్సరాల్లో అక్కడి సైనిక, వ్యూహాత్మక రహస్యాలను సేకరించి, భారత దేశానికి అందించాడు. ఈ సమాచారం యుద్ధాల్లో మన సైన్యానికి నిర్ణయాత్మక సహాయం చేసింది.

1972లో పట్టుబడి..
1972లో భారత్‌కు తిరిగి వస్తుండగా పాకిస్తాన్‌ బలగాలు రోషన్‌ లాల్‌ జల్లాను అరెస్టు చేశాయి. 15 ఏళ్లు జైలులో బంధించి చిత్రహింసలు పెట్టాయి. శారీరకంగా, మానసికంగా హింసించాయి. అయినా దేశభక్తితో లాల్‌ జల్లా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అన్నింటికీ మౌనమే సమాధనంగా చెప్పాడు. 1987లో విడుదలై భారత్‌కు తిరిగి వచ్చాడు.

కనీస గుర్తింపు లేక..
దేశం కోసం సర్వం త్యాగం చేసిన జల్లాను భారత ప్రభుత్వం పట్టించుకోలేదు. వైద్య సహాయం అందించలేదు. కనీసం పెన్షన్‌ కూడా ఇవ్వలేదు. దీంతో అనారోగ్యంతో 2021లో సామాన్యుడిగా ప్రయాణం ముగించాడు. అతని త్యాగాలు రికార్డుల్లో మాత్రమే మిగిలాయి. ఈ ఘటన దేశసేవకుల పట్ల మన వ్యవస్థ ఉదాసీనతను బహిర్గతం చేస్తుంది.

జల్లా కథ ప్రేరణ కాకుండా, హెచ్చరికగా ఉంటుంది. ధురంధర మూవీలు ట్రెండ్‌ అవుతున్నప్పుడు, నిజమైన హీరోలను మర్చిపోతున్నాం. ప్రభుత్వాలు గూఢచారి వ్యవస్థను బలోపేతం చేసి, వారి కుటుంబాలకు సమర్థవంతమైన మద్దతు ఇవ్వాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper