Homeజాతీయ వార్తలుThe end of an era in Lutyens Delhi: లుట్యెన్స్‌ ఢిల్లీలో ఒక యుగం...

The end of an era in Lutyens Delhi: లుట్యెన్స్‌ ఢిల్లీలో ఒక యుగం ముగింపు.. సిస్టం మాత్రం ఇప్పటికీ అలాగే..

The end of an era in Lutyens Delhi: బ్రిటిష్‌ సామ్రాజ్యం వెళ్లిపోయి 79 ఏళ్లు అయినా, ఢిల్లీ హృదయంలో ఒక చిన్న ద్వీపం ఇప్పటికీ ఆ కాలపు మానసికతను, ప్రివిలేజ్‌ను, ఎలిటిజాన్ని కాపాడుకుంటోంది. అదే ఢిల్లీ జింఖానా క్లబ్‌. దాదాపు ఎనిమిదేళ్ల ప్రయత్నాల తర్వాత మే 22, 2026న కేంద్ర ప్రభుత్వం కీలక జారీ చేసిన ఉత్తర్వులు ఆ ’చిన్న ద్వీపం’కు భారీ సవాల్‌ విసిరాయి. 27.3 ఎకరాల ప్రధాన భూమిని జూన్‌ 5లోగా ఖాళీ చేసి అప్పగించాలని ఆదేశించింది. ఇది కేవలం ఒక క్లబ్‌ భూమి స్వాధీనం కాదు.. లుట్యెన్స్‌ ఢిల్లీలో ఇంకా కొనసాగుతున్న ’పాత సిస్టమ్‌’పై ఒక బలమైన వ్యవస్థ.

సాంస్కృతిక గాయం..
బ్రిటిష్‌ వారసత్వం1911లో బ్రిటిష్‌వారు రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినప్పుడు, కొత్త అధికార కేంద్రానికి అనుగుణంగా సామాజిక, క్రీడా సంస్థలు అవసరమయ్యాయి. 1913 జూలై 3న ఇంపీరియల్‌ ఢిల్లీ జింఖానా క్లబ్‌ స్థాపించబడింది. మొదటి అధ్యక్షుడు స్పెన్సర్‌ హార్‌కోర్ట్‌ బట్లర్‌. లుట్యెన్స్‌ డిజైన్‌ చేసిన సఫ్దర్జంగ్‌ రోడ్‌పై ఉన్న ఈ క్లబ్‌ బ్రిటిష్‌ అధికారులు, సైనికులు, భారతీయ రాజులు (ఏడుగురు మహారాజులు లైఫ్‌ మెంబర్లు), ఎలైట్‌ వర్గాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. భారతీయులకు ప్రవేశం కూడా కష్టం.

స్వాతంత్య్రం వచ్చాక…
స్వాతంత్య్రం వచ్చాక ’ఇంపీరియల్‌’ అనే పదం తొలగించారు. కానీ మానసికత మారలేదు. రాబర్ట్‌ టార్‌ రస్సెల్‌ డిజైన్‌ చేసిన భవనం, 26 టెన్నిస్‌ కోర్టులు, స్విమ్మింగ్‌ పూల్, బార్లు, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్‌ ఇవన్నీ లగ్జరీ, ఎక్స్‌క్లూసివిటీకి ప్రతీకలు. సభ్యత్వం వారసత్వంగా వస్తుంది లేదా 30 ఏళ్ల వెయిటింగ్‌ లిస్ట్‌. ప్రభుత్వ సర్వంట్లకు ప్రత్యేక ప్రాధాన్యత. సభ్యత్వ ఫీజు లక్షలు నుంచి కోట్ల వరకు. కానీ పబ్లిక్‌ ల్యాండ్‌పై నామమాత్రపు అద్దె (నెలకు వెయ్యి రూపాయలు) మాత్రమే చెల్లిస్తున్నారు.

ప్రస్తుత సంక్షోభం ఏమిటి?
2026 మే 22న హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ ల్యాండ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ ఆదేశాలు జారీ చేసింది. ‘హైలీ సెన్సిటివ్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఏరియా‘లో ఉన్న ఈ భూమి రక్షణ మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రత, పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ప్రాజెక్టుల కోసం అవసరం. ప్రధాని నివాసం (7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌) సమీపంలో ఉండటం కీలకం. లీజ్‌ షరతులలోని క్లాజ్‌ 4 ప్రకారం పబ్లిక్‌ పర్పస్‌కు భూమి తిరిగి తీసుకోవచ్చు. జూన్‌ 5లోగా శాంతియుతంగా అప్పగించాలి, లేకపోతే చట్టప్రకారం చర్యలు.

కోర్టుకు వెళ్లే యోచనలో సభ్యులు..
క్లబ్‌ సభ్యులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంటరిమ్‌ స్టే ఇవ్వలేదు, కానీ బలవంతపు చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 600 మంది ఉద్యోగుల ఉపాధి, వారసత్వ సభ్యత్వాలు, హెరిటేజ్‌ విలువలు – ఇవన్నీ సవాలు చేస్తున్నారు. మరోవైపు, క్లబ్‌పై గతంలో ఆర్థిక అక్రమాలు, మిస్‌మేనేజ్‌మెంట్, ఫ్యాక్షనలిజం ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌సీఎల్‌టీ కూడా గతంలో ఇంపీరియల్‌ మైండ్‌సెట్‌ అని విమర్శించింది. అప్పులు (సుమారు రూ.47 కోట్లు) కూడా చెల్లించకపోవడం వివాదానికి ఒక కారణం.

డబుల్‌ స్టాండర్డ్, మార్పు అవసరం..
కశ్మీర్‌ ఫైల్సో్లని ఆ డైలాగ్‌ ఇక్కడ సరిపోతుంది.. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కానీ ’సిస్టమ్‌’ ఇంకా పాత ఎలైట్‌ చేతుల్లోనే ఉంది. జింఖానా క్లబ్‌ ఆ సిస్టమ్‌కు జీవంత ఉదాహరణ. పేదల భూముల కోసం రోడ్డుపైకి వచ్చే సంఘాలు, కమ్యూనిస్టులు, మీడియా ఈ 27 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం మీద మౌనం వహించడం ఆశ్చర్యం. ఇది వారి ’లిబరల్‌’ సర్కిల్స్‌కు చెందినది కాబట్టి. ఈ చర్య సానుకూలం. పబ్లిక్‌ ల్యాండ్‌ పబ్లిక్‌ పర్పస్‌కు వాడాలి. జాతీయ భద్రత ప్రధానం. ఒకవేళ హెరిటేజ్‌ కాపాడాలని అనుకుంటే, ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మార్చవచ్చు. కానీ ప్రివిలేజ్‌ను శాశ్వతంగా కాపాడుకోవడం ఆధునిక భారత్‌కు సరికాదు.

బ్రిటిష్‌వారు వెళ్లిపోయారు. కానీ వారి మనస్తత్వం, ఎక్స్‌క్లూసివ్‌ క్లబ్‌లు, ఖాన్‌ మార్కెట్‌ గ్యాంగ్‌ సంస్కృతి ఇంకా మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. ప్రజాస్వామ్య భారత్‌లో ప్రజల భూమి ప్రజల కోసమే. కోర్టు తీర్పు ఏమైనా, ఈ చర్చ దేశం మొత్తానికి అవసరం. లుట్యెన్స్‌ ఢిల్లీ మారాలి. కొత్త భారత్‌ నిర్మాణం కోసం పాత గోడలు కూల్చడం తప్పనిసరి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular