Homeజాతీయ వార్తలుTamil Nadu Vijay Victory: తమిళనాడులో విజయ్ గెలుపు వెనుక పవన్.. అదిగో సాక్షం

Tamil Nadu Vijay Victory: తమిళనాడులో విజయ్ గెలుపు వెనుక పవన్.. అదిగో సాక్షం

Tamil Nadu Vijay Victory: తమిళనాడులో విజయ్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది. మిగతా పార్టీల సహకారంతో ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయ్ విజయం సాధించడం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తమిళనాడులో విజయ్ గెలుపుతో ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా కానీ.. విజయ్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాహటంగా మద్దతు తెలపలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయ్ ఎప్పుడు […]

Tamil Nadu Vijay Victory: తమిళనాడులో విజయ్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది. మిగతా పార్టీల సహకారంతో ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయ్ విజయం సాధించడం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తమిళనాడులో విజయ్ గెలుపుతో ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా కానీ.. విజయ్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాహటంగా మద్దతు తెలపలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయ్ ఎప్పుడు ఆయనను కలవలేదు. విజయ్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి మద్దతు తెలిపిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ప్రాణ స్నేహితుడు అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటుంది. అయితే తమిళనాడులో విజయ్ గెలుపు వెనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారన్నది అక్కడి విశ్లేషకుల మాట. డీఎంకే ఓటమి ద్వారా విజయ్ గెలుపునకు దోహదపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

* సనాతన ధర్మ పరిరక్షణ నినాదం
పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) సనాతన ధర్మ పరిరక్షణ కోసం గట్టిగానే కృషి చేశారు. ఏపీలో తిరుమలలో జరిగిన వ్యవహారాలతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఒక బలమైన వ్యవస్థ అవసరం అని భావించారు. అందుకే సనాతన ధర్మ నినాదంతో ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో తమిళనాడు నుంచి పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి. అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో విభేదించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది మొదలు తమిళనాడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో డిఎంకె పార్టీ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అహంకారపూరిత మాటలతో డీఎంకే పవన్ కళ్యాణ్ ను ప్రత్యర్థి గా మార్చుకుంది. తెలుగు మూలాలు ఉన్న స్థిరపడిన వారితో పాటు హిందూ మతాన్ని ఇష్టపడే వారు డిఎంకెకు పూర్తిగా దూరమయ్యారు.

* డీఎంకే దూకుడుకు కళ్లెం..
తమిళనాడులో అధికార డిఎంకెకు వ్యతిరేకంగా దూకుడుగా వెళ్లిన నేతల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. సనాతన ధర్మం పేరిట పలుమార్లు తమిళనాడులో పర్యటించారు. అయితే పవన్ వెనుక బిజెపి ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ను బిజెపి రంగంలోకి దించిందన్న అనుమానాలు పెరిగాయి. నటుడు ప్రకాష్ రాజ్ సైతం పవన్ వెనుక బిజెపి ఉందని ఆరోపణలు చేసేవారు. తమిళనాడులో బలపడాలని ఎప్పటినుంచో బీజేపీ భావిస్తోంది. కానీ బలమైన ద్రవిడ సిద్ధాంతాలతో డీఎంకే, అన్నా డీఎంకే ఉండడంతో అది సాధ్యపడలేదు. అయితే మధ్య మార్గంగా విజయ్ టీవీ కే వచ్చింది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదంతో డీఎంకే పై వ్యతిరేకత వచ్చింది. ఆ ఓటు టీవీ కే విజయ్ వైపు మళ్లింది. అందుకే విజయ్ విజయం వెనుక పవన్ ఉన్నారని అక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper