spot_img
Homeజాతీయ వార్తలుSanitation worker viral news: 20 తులాల బంగారం, కేజీ వెండి దొరికింది.. ఇతడు ఏం...

Sanitation worker viral news: 20 తులాల బంగారం, కేజీ వెండి దొరికింది.. ఇతడు ఏం చేశాడంటే..

Sanitation worker viral news: నేటి కాలంలో మంచి అనేది పుస్తకాల్లో చదువుకోడానికి మాత్రమే పనికి వస్తోంది. మానవత్వం అనేది సోషల్ మీడియా రీల్స్ లోనే కనిపిస్తోంది. ఇక పరోపకారం.. ఇతర గొప్ప గొప్ప లక్షణాలు.. మాటలు మొత్తం సుప్త చేతనవస్థలో పడిపోయి చాలా సంవత్సరాలయింది. అలాంటి కాలంలో అప్పుడప్పుడు కొంతమంది మేమున్నామంటూ ముందుకు వస్తూ ఉంటారు. మానవత్వాన్ని.. పరోపకారాన్ని ప్రదర్శిస్తుంటారు. సమస్త మానవాళికి ఆదర్శమవుతుంటారు. ఇతడు కూడా అటువంటి వ్యక్తే.

అది తమిళనాడు రాష్ట్రం. తిరువారురు అనే ప్రాంతం. ఇక్కడ దురై అనే వ్యక్తి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తుంటాడు. ఇతడు ప్రతిరోజు పట్టణంలోని ప్రధాన వీధులను తన తోటి కార్మికులతో శుభ్రం చేస్తుంటాడు. ఇలా అతడు ఒక వీధిని శుభ్రం చేస్తుండగా ఒక బ్యాగ్ కనిపించింది. మొదట్లో దానిని అతడు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎందుకనో అనుమానంతో దానిని తీసుకున్నాడు. జిప్ తీసి తెరిచి చూశాడు. అంతే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ బ్యాగులో 20 తులాల బంగారం కనిపించింది. ఒక కిలో వెండి కూడా ఉంది. ఇప్పుడున్న ధరల ప్రకారం చూసుకుంటే వాటి విలువ ఏకంగా 23 లక్షలకు మించి ఉంటుంది .

పేరుకు పారిశుధ్య కార్మికుడైనప్పటికీ దొరై ఉన్నత విలువలు కలిగి ఉన్నవాడు. పైగా ఆ బ్యాగ్ ఎవరిదో అతనికి తెలియదు. అందులో ఉన్న విలువైన బంగారం.. వెండి ఎవరో పొరపాటున పోగొట్టుకున్నారని అనుకున్నాడు. అంతే.. వివరాలు తెలుసుకొని ఆ బ్యాగును పోగొట్టుకున్న వాళ్లకు ఇచ్చాడు. ఆ బ్యాగు పోగొట్టుకున్న వ్యక్తి కూతురు పెళ్లి కోసం ఆ నగలు తయారు చేయించాడు. ఆ బ్యాగును దేవుడి మాదిరిగా తనకు అందించిన దొరై ని ఆ వ్యక్తి అభినందించాడు. కష్టకాలంలో ఆదుకున్నావని కన్నీటి పర్యంతమయ్యారు.

వాస్తవానికి ఆ బ్యాగు దురైకి కాకుండా మరొకరికి దొరికితే పరిస్థితి ఎలా ఉండేది.. ఆ బ్యాగులో ఉన్న నగలు తీసుకొని.. బ్యాగును పక్కన పడేసేవారు. ఎందుకంటే మన సమాజంలో చాలామంది ఉచితంగా వచ్చే వాటిని.. ఆయాచితంగా దొరికే వాటిని వదిలిపెట్టరు. కాకపోతే దొరై అలా చేయలేదు. ముందుగానే చెప్పుకున్నాం కదా అతనిలో మానవత్వం ఎక్కువ. మనిషి తత్వం ఎక్కువ. పరుల సొమ్ము పాము వంటిది అనే సూక్తిని నమ్మే గుణం అతనిలో చాలా ఎక్కువ. అందుకే ఆ బ్యాగ్ పోగొట్టుకున్న వారికి తిరిగి ఇచ్చేసాడు. పెళ్లి ఇంట్లో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి ఇచ్చేసాడు. కొంతమంది మహానుభావులు మన ముందే తిరుగుతుంటారు. మానవత్వాన్ని నింపుకొని సామాన్యులుగా కనిపిస్తుంటారు. దొరై కూడా అటువంటి వ్యక్తే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper