S Jaishankar: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన వేళ… పాకిస్తాన్ తో అమెరికా సంబంధాలు మరోసారి చర్చకు దారి తీసాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫారిన్ మినిస్టర్ ఎస్ జై శంకర్ అనుసరించిన దౌత్య వ్యూహం ఆసక్తిని కలిగించింది. 2008 ముంబై ఉగ్రదాడుల జ్ఞాపకాలను రూబియో కు ప్రత్యక్ష సాక్షి ద్వారా వివరించ చేయడంతో.. ఉగ్రవాదంపై భారత్ ఆందోళనను ఆయన ముందు ఉంచారు.
తాజా పరిణామం ఏంటంటే
2026 అక్టోబర్ 20వ తేదీన ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో 26/11 ఉగ్రదాడుల బాధితులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో రూబియో పాల్గొన్నారు. ఆ సమయంలో జై శంకర్ తాజ్ హోటల్, భద్రతా విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన సునీల్ కుడ్యాడి ని ఆయనకు పరిచయం చేశారు.
2008లో ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్రవాదులు తాజ్ హోటల్లోకి ఎలా ప్రవేశించారు.. అక్కడ దాదాపు 60 గంటల పాటు సాగిన భయానక పరిస్థితులు ఏమిటి.. సిబ్బంది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.. అనే విషయాలను సునీల్ వివరించారు. సునీల్ వెల్లడించిన వివరాలు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసిన ఉగ్రవాద సంస్థల దాడుల తీవ్రతను అమెరికా ప్రతినిధికి గుర్తు చేశాయి.
పాకిస్తాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని.. భౌగోళికంగా కూడా ఆదేశంతో సంబంధాలు కొనసాగించడం అమెరికాకు అవసరమని రూబియో వివరించారు. ఇదే సమయంలో పాకిస్తాన్ దేశంతో సంబంధాలు భారత్ తో అమెరికా భాగస్వామ్యానికి నష్టం కలిగించమని రూబియో హామీ ఇచ్చారు. ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తే దేశాలను అమెరికా వ్యతిరేకిస్తుందని రూమియో పేర్కొన్నారు.
జై శంకర్ చూపించిన చతురతను నిశ్శబ్ద దౌత్యం గా జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అంతేకాదు భారత్ భద్రతాపరమైన ఆందోళనలను అమెరికా ముందు ఉంచిందని.. ఈ ప్రయత్నం అమెరికా మనసు మార్చే విధంగా ఉండొచ్చని కృష్ణ శకల అభిప్రాయపడుతున్నారు. అయితే పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాద తాండాగా నిరూపించడానికి భారత తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను.. అమెరికాకు అనేక సందర్భాలలో చూపించింది.
26/11 దాడుల ప్రత్యక్ష సాక్షి అనుభవాన్ని రూబియోకు వివరించడం ద్వారా ఉగ్రవాదంపై జైశంకర్ భారత్ వైఖరిని ఆయన మరోసారి ప్రతిబింబించారు. ఇటీవల కాలంలో పాకిస్థాన్ తో అమెరికా అనేక దగ్గరి సంబంధాలను కొనసాగిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకం అంటూనే పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తోంది. పాకిస్థాన్ అసలు ఉగ్ర రంగును భారత్ బయటపెట్టిన నేపథ్యంలో అమెరికా ఎలాంటి అడుగులు వేస్తుంది.. ఏ తరహాలో చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.