Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ , సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కోలీవుడ్ నుండి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఈమధ్య కాలంలో వచ్చాయి. కానీ ఒక్కటి కూడా 1000 కోట్ల గ్రాస్ మార్కు ని అందుకోలేదు. ఇప్పుడు ‘జైలర్ 2’ చిత్రం వెయ్యి కోట్ల మార్కుని అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. 6 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 550 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘జైలర్ ‘ చిత్రం ఫుల్ రన్ లో 650 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటే , ‘జైలర్ 2’ చిత్రం మొదటి వారం లోనే 600 కోట్ల మార్కుకి దగ్గరాగా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదు కానీ , తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిన్నటితో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది.
ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన గ్రాస్ వసూళ్లు ఎంతో వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఒక్క తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 62 కోట్లు , కేరళ నుండి 56 కోట్లు , కర్ణాటక నుండి 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా హిందీ వర్షన్ నుండి 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి ఏకంగా 204 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకొని , క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే , ఈ చిత్రం మరో 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.
విడుదలకు ముందు ఈ చిత్రానికి 304 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 231 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అంటే నేడు , రేపు వచ్చే వసూళ్లతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోబోతుంది అన్నమాట. విడుదలకు ముందు హైప్ పెద్దగా లేకపోవడం తో బయ్యర్స్ చాలా రిస్క్ చేశారని అంతా అనుకున్నారు. కానీ విడుదల తర్వాత కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది ఈ చిత్రం. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత లాభాలను రాబడుతుందో చూడాలి.