Homeజాతీయ వార్తలుRural Employment Scheme Reform: గ్రామీణ ఉపాధి.. పాత పథకంలో లోపాలకు జీ రామ్‌జీలో పరిష్కారం

Rural Employment Scheme Reform: గ్రామీణ ఉపాధి.. పాత పథకంలో లోపాలకు జీ రామ్‌జీలో పరిష్కారం

Rural Employment Scheme Reform: ప్రభుత్వాలు పథకాలను గొప్ప ఉద్దేశంతో ప్రవేశపెడతాయి. పేదల జీవితాలు, ప్రజల జీవన ప్రభావాలు మెరుగుపడాలని స్కీంలు రూపొందిస్తాయి. అయితే క్షేత్రస్థాయిలో అవినీతి ప్రవేశిస్తుంది. అక్రమాలకు తెర తీస్తుంది. అర్హులకు అన్యాయం జరుగుతుంది. అన్ని పథకాల పరిస్థితి ఇదే. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ఢిల్లీ నుంచి రూపాయి విడుదల చేస్తే.. క్షేత్రస్థాయికి 15 పైసలు మాత్రమే చేరుతుంది. అలాంటి పథకమే గ్రామీన ఉపాధి హామీ పథకం. గ్రామీణ పేదలకు 100 రోజులు పని […]

Rural Employment Scheme Reform: ప్రభుత్వాలు పథకాలను గొప్ప ఉద్దేశంతో ప్రవేశపెడతాయి. పేదల జీవితాలు, ప్రజల జీవన ప్రభావాలు మెరుగుపడాలని స్కీంలు రూపొందిస్తాయి. అయితే క్షేత్రస్థాయిలో అవినీతి ప్రవేశిస్తుంది. అక్రమాలకు తెర తీస్తుంది. అర్హులకు అన్యాయం జరుగుతుంది. అన్ని పథకాల పరిస్థితి ఇదే. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ఢిల్లీ నుంచి రూపాయి విడుదల చేస్తే.. క్షేత్రస్థాయికి 15 పైసలు మాత్రమే చేరుతుంది.

అలాంటి పథకమే గ్రామీన ఉపాధి హామీ పథకం. గ్రామీణ పేదలకు 100 రోజులు పని కల్పించాలని దీనిని రూపొందించారు. పని చేయనివారి పేరిట డబ్బులు కాజేశారు. గ్రామాల అభివృద్ధికి రూపొందిస్తే పట్టణాల్లో అమలు చేశారు. అధికారులు కుమ్మక్కై బిల్లులు కాజేశారు. సోషల్‌ ఆడిట్‌ జరిగినా ఉపయోగం లేదు. ఇక బిల్లుల చెల్లింపులు కూడా ఆలస్యం అవుతున్నాయి.

జీ రామ్‌జీతో ఉపాధి గ్యారంటీ..
పదేళ్ల అధ్యయనాల తర్వాత కేంద్రం తీసుకొచ్చిన ’గ్రామీణ ఉపాధి గ్యారంటీ మిషన్‌’ (జీ రామ్‌జీ) గత లోపాలను సరిచేస్తూ రూపొందింది. పేరులో ‘రామ్‌’ ఉండటానికి విపక్షాలు అభ్యంతరం చెప్పుతున్నా, ఇది గ్రామీణ పేదలకు 120 రోజుల కనీస పని హామీ ఇస్తుంది. సస్టైనబుల్‌ అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది.

Also Read: మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన.. నేతన్యాహు బలం పెంచేందుకేనా?

వ్యవసాయానికి అనుసంధానం..
గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత గ్రామాల్లో కూలీలు తగ్గిపోయారు. దీంతో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉపాధి పనులకు వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని రైతులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. తాజాగా మోదీ ప్రభుత్వం జీ రామ్‌జీని వ్యవసాయానికి అనుసంధానం చేసింది.

చెల్లింపులు వేగవంతం..
గత హామీలో 100 రోజులు, నెలలాంతా ఆలస్య చెల్లింపులు ఉండేవి. జీ రామ్‌జీలో వారానికి ఒకసారి డబ్బులు చేరేలా డిజిటల్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఫిర్యాదులకు ఆన్‌లైన్‌ పరిష్కారాలు, సోషల్‌ ఆడిట్‌లు మెరుగయ్యాయి. ప్రతీ కూలీకి ఇందులో 120 రోజులు పని కల్పిస్తారు.

రాజకీయంగా, ప్రతిపక్షాలు పేరు మార్పును వివాదాస్పదం చేస్తున్నా, టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ అవినీతిని 40% తగ్గించవచ్చని నిపుణులు అంచనా. గ్రామీణ ఆదాయాలు పెరిగి, మౌలిక సదుపాయాలు బలపడతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper