MP Gorantla Madhav Video Issue: ఏపీలో డర్టీ పిక్చర్ ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడడం లేదు. కొద్ది రోజుల కిందట హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒకటి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇది కొద్దిరోజుల పాటు ప్రకంపనలే సృష్టించింది. విపక్షాలు ఎంపీ మాధవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా.. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఒకటి, రెండు రోజుల తరువాత స్పందించింది. నిజమని తేలితే ఎంపీపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అయితే తరువాత మాత్రం అది ఫేక్ అంటూ విపక్షాలపై ఎదురుదాడి మొదలు పెట్టారు. అయితే విపక్షం కూడా దానిపై పట్టు వీడలేదు. అదో ప్రజా సమస్యగా పరిగణించి గట్టి పోరాటమే చేసింది. అటు పోలీసులు, సీఐడీ అధికారులు కూడా కలుగజేసుకున్నారు. దీనిపై బాధితులమంటూ ఎవరూ ముందుకొచ్చి ఫిర్యాదు చేయలేదని భావించారో ఏమో కానీ…అది ఫేక్ వీడియోగా తేల్చేశారు. ఎండ్ కార్డు వేయాలని ప్రయత్నించారు. విపక్షాల ఆరోపణలను పట్టించుకోనవసరం లేదని సంకేతాలిచ్చారు. అటు వైసీపీ నాయకులు కూడా నగ్న వీడియో బాధిత ఎంపీకి బాహటంగామద్దతు పలికారు. అయితే రాష్ట్రంలో కొత్తగా పుట్టకొచ్చిన అంశాలతో ఎంపీ గోరంట్ల డర్టీ పిక్చర్ వ్యవహారం కాస్తా పక్కకు తప్పింది. కొద్దిగా సైలెంట్ అయ్యింది.

-ఏపీ సీఎస్ కు లేఖ..
తాజాగా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు ఆదేశాలిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అక్కడి అధికారులు లేఖ పంపడంతో మరోసారి డర్టీ పిక్చర్ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నెల 23న ఏపీకి చెందిన డిగ్నిటీ ఫర్ ఉమెన్ జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ తో పాటు జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులను కలిశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ పై ఫిర్యాదుచేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపించాయి. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో జేఏసీ కన్వినర్ చెన్నుపాటి కీర్తికి రాష్ట్రపతి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. దీంతో డర్టీ పిక్చర్ అంశం మరోసారి ఏపీలో దుమారం రేపే అవకాశముంది.
Also Read: Sara Bejlek: 16 ఏళ్ల యువ టెన్నిస్ క్రీడాకారిణితో ఆ ముద్దులు.. హగ్గులు ఆ చేష్టలేంటి.? వీడియో వైరల్
-బాలక్రిష్ణ సెటైర్లు..
కాగా డర్టీ పిక్చర్ పై నేతలు స్పందిస్తూనే ఉన్నారు. న్యూడ్ వీడియో వ్యవహారంపై లేటెస్టుగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఎంపీ సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని విమర్శించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేస్తే వారికి సేవ చేయాల్సింది పోయి.. నీలిచిత్రాలు చూపించారంటూ వ్యాఖ్యానించారు. ఏ ముఖం పెట్టుకొని హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేయడానికి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఎంపీ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
-భారీ కాన్వాయ్ తో స్వాగతమేమిటి?
రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 13న ఢిల్లీలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగాన్ని అనుసరించి పాలన చేయాలన్నందునే తనపై దేశద్రోహం కేసు నమోదుచేసి చిత్రహింసలు పెట్టిన సంగతిని గుర్తుచేశారు. నగ్న వీడియోతో దొరికిన మా పార్టీ ఎంపీకి 500 కార్ల కాన్వాయ్ తో స్వాగతం పలకడం ఏమిటని ప్రశ్నించారు. తన పాలనను దేశం మొత్తం చూస్తుందన్న తమ సీఎం జగన్ ప్రకటన నిజమేనని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం నగ్న వీడియోనే చూస్తుందని వ్యాఖ్యానించారు.

-సెల్ ఫోన్ చూడొద్దన్నాను…
అటు నటుడు పృధ్విరాజ్ కూడా తాజాగా విశాఖలో స్పందించారు. సినిమా షూటింగ్ కు వచ్చిన ఆయనకు ఎంపీ డర్టీ పిక్చర్ పై విలేఖర్లు ప్రశ్నించగా ఆయన మాట్లాడారు. అక్కా చెల్లెళ్లు, మహిళలను తొలిసారిగా సెల్ ఫోన్ చూడవద్దని విన్నవించాల్సి వచ్చిందన్నారు. వరలక్ష్మీ వ్రతం ముందురోజే ఆ దరిద్రాన్ని చూశానని..అందుకే మిగిలిన వారిని చూడొద్దని కోరినట్టు చెప్పారు. దేశ చరిత్రలో ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు లేవన్నారు. తన విషయంలో వారం రోజుల పాటు చర్చలు జరిపిన వారు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు.
మొత్తంగా గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్రపతి వరకూ చేరడం.. వారు స్పందించి దర్యాప్తునకు ఆదేశించడంతో దుమారం చెలరేగింది. ఈ పరిణామం ఏపీలోని అధికార వైసీపీకి మింగుడపడనిది మారింది. ప్రతిపక్షాలకు మాత్రం మరో అస్త్రం దొరికినట్టైంది.
Also Read:Yellow Crazy Ants- Tamil Nadu: తమిళనాడులో గ్రామాలను ఖాళీ చేయిస్తున్న ‘చీమలు’.. అసలెందుకీ దండయాత్ర?
https://www.youtube.com/watch?v=5THwJgxJGv0
[…] […]