spot_img
Homeజాతీయ వార్తలుVanama Raghava: నా చావుకు రాఘవనే కారణం.. రామ‌కృష్ణ మ‌రో వీడియో బ‌య‌ట‌కు..

Vanama Raghava: నా చావుకు రాఘవనే కారణం.. రామ‌కృష్ణ మ‌రో వీడియో బ‌య‌ట‌కు..

Vanama Raghava: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ చేస్తున్న అరాచకాలకు అంతే లేదు. భూ దందాలు, సెటిల్‌మెంట్లు, అత్యాచారాలు ఇలా చెప్పుకుంటూ పోతే అతని చరిత్ర చాలానే ఉంది. వనమా రాఘవ కారణంగా పాల్వంచలో ఇటీవల తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు నాగ రామకృష్ణ. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చేసిన సెల్పీ వీడియో మరోటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

Vanama Raghava
Vanama Raghava

ఆయన వీడియోలో ఎమన్నారో ఆయన మాటాల్లోనే ‘‘ మా నాన్నా పేరు చిట్టబ్బాయి. తూగో జిల్లాల మోతుగూడెంలో ఆరోగ్య శాఖలో హెల్త్ ఇన్ స్పెక్టర్‌గా పని చేసేవారు. నాకు 13 ఏళ్ల వయస్సులో మందుపాతర పేలి మా నాన్న చనిపోయారు. ప్రస్తుత నా పరిస్థితి కారణం వనమా రాఘవ. ఆయనకు మా అక్క మాధవితో గత 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. మా అక్క, అమ్మ సూర్యవతి, రాఘవా కలిసి నాకు రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారు. ఇటీవల పెద్ద మనుషుల సమక్షంలో ఆస్తిలో వాటాలు తేల్చుకున్నాం. అయితే వాటాలను పంచకుండా నా చావుకు కారణమయ్యారు’’ అని నాగ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: ఎట్టకేలకు పోలీసుల అదుపులోకి వనమా రాఘవ.. రాజమండ్రికి పారిపోతుండగా అరెస్ట్..

‘‘మా సొంత వూరు పోలవరం మండలం పాత పట్టిసీమ. మా స్వస్థలానికి ఎలాంటి సంబంధం లేని రాఘవ మా ఆస్తి పంపకాల విషయంలో జోక్యం చేసుకుని నన్ను తీవ్రంగా వేధించాడు. అక్కకు పోలవరంలో రెండు ఎకరాలు, రాజమండ్రిలో రెండు ఇళ్ల స్థలాలు, గోకవరంలో 200 గజాల స్థలం, అమ్మ రిటైర్‌మెంట్‌ డబ్బులో కూడా వాటా ఇచ్చాం. అయినా వాటాను పంచమని అడిగితే ఇబ్బందులకు గురిచేశారు. నేను రాజమండ్రిలో అద్దె ఇల్లులో ఉంటున్నా.

ఇద్దరు ఆడపిల్లలు. వారి చదువులు, కుటుంబం గడవడానికి సుమారు రూ.30లక్షలు అప్పులు చేశాను. వనమా రాఘవ ఉండగా నాకు న్యాయం జరగదు.దీంతో చేసేది లేక నా భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నా. ఈ వీడియో మీరు చూసే సమయానికి మేం బతికి ఉండం. నాకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దు.’’ అంటూ నాగ రామకృష్ణ ఆవేదనతో సెల్పీ వీడియో తీశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: ఎట్టేకేలకు వనమా రాఘవను సాగనంపిన టీఆర్ఎస్

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper