Rajinikanth Sukumar: టాలీవుడ్లోని క్రియేటీవ్ డైరెక్టర్లలో సుకుమార్ ఒక్కరు. లెక్కల మాస్టరు నుంచి దర్శకుడిగా మారిన సుకుమార్ తనదైన లాజిక్కులతో సినిమాలు తీస్తూ తెలుగులో వరుస హిట్లను కొడుతూ ముందుకెళుతున్నారు. రీసెంట్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ డిసెంబరు 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళుతోంది.

తాజాగా ఆయన ఓ తమిళ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ రోబో సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు తాను అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. అప్పటికే ‘ఆర్య’ మూవీ చూసిన రజనీకాంత్ తనను పకలరించడానికి దగ్గరకు వచ్చారని చెప్పారు. ఆయన పక్కకు రాగానే ఒంట్లో వణుకు వచ్చిందని వెంటనే ‘సర్ ..సర్’ అనడం ప్రారంభించానని చెప్పారు.
రజనీ సార్ తన దగ్గరికి వచ్చి కూర్చోమని చెప్పారన్నారు. ‘ఆర్య’లో హీరోయిన్ హెయిర్ ఊడుతూ పడిపోయే సీన్ గురించి చెబుతూ సూపర్ గా ఉందంటూ కితాబిచ్చారని సుకుమార్ చెప్పారు. అలాగే కాలేజీలో చుట్టూ పరిసరాల్లోని వస్తువులను పగులగొట్టే ఫైట్ థాట్ ఎలా వచ్చిందని అడుగుతుండగా ఆయన షార్ట్ రెడీ కావడంతో వెళ్లిపోయారని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ వచ్చి తనను కుర్చోమన్నారని. అయితే ఒకే సీటు ఉండటంతో తాను కుర్చోలేదని చెప్పారు.
ఆయన స్వయంగా సీటు తెచ్చి కూర్చోమని చెప్పడంతో ఆయన పక్కన కూర్చోని మాట్లాడనని చెప్పారు. అయితే తాను కూర్చున్నప్పటికీ మనసులో నిల్చున్నా అనే ఫీలింగే ఉందని చెప్పారు. ఆయనకు దర్శకులంటే అమితమైన గౌరవం ఉందని, అందుకే ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ క్షణాలన్నీ కూడా తన లైఫ్ లో మరిచిపోలేనని సుకుమార్ చెప్పడం ఆకట్టుకుంది.