Nidhhi Agarwal: బోల్డ్ భామ ‘నిధి అగర్వాల్’ తన బోల్డ్ లుక్స్ తో పాటు తన బోల్డ్ కామెంట్స్ తో కూడా ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. అయితే, నిధి అగర్వాల్ ఇటీవల తన ఇన్‌స్టగ్రామ్ ఖాతాలో మద్యం బాటిల్ తో ఉన్న ఓ వీడియోను పెట్టింది. ఆ వీడియో చూసిన కొంతమంది అభిమానులు ఆమెకు చివాట్లు పెడుతూ కామెంట్లు పెట్టారు. మొత్తమ్మీద మందు బాటిల్ తో దర్శనం ఇచ్చిన ‘నిధి అగర్వాల్’ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read: క్లైమాక్ లేకుండానే 1945 మూవీ.. మరో వివాదంలో రానా?
ఇంతకీ నిధి ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఈ ముద్దుగుమ్మ ఓ లిక్కర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన మద్యాన్ని ప్రమోట్ చేసింది. అందులో భాగంగానే మద్యం బాటిల్‌తో కనిపించింది నిధి. ఇక ఈ బోల్డ్ భామకి చిన్న సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. అన్నట్టు నిధి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు వాన పాటల్లో నటించడం అసలు ఇష్టం లేదని చెప్పింది.
అలాగే ఉదయమే ఏడుపు గొట్టు సీన్స్ లో నటించడం కూడా ఆమెకు అస్సలు ఇష్టం లేదట. కాకపోతే, లిప్ కిస్ ల్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా నటిస్తోందట. ఇంతకీ వాన పాటలు ఎందుకు ఇష్టం లేదు అంటే.. తనకు చాలా చికాకు అంటోంది. వానల్లో తడవడం, మళ్ళీ బట్టలు ఆరబెట్టుకోవడం, మళ్ళీ తడవడం లాంటివి చాలా చిరాగ్గా ఉంటుందట. కానీ ఎక్స్ పోజింగ్ విషయంలో మాత్రం నిధి ఎలాంటి పరిధులు పెట్టుకోలేదట.
Also Read: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న బూతు సినిమా !
View this post on Instagram