Uttar Pradesh Storms: సరిగ్గా కొంత కాలం క్రితం తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలోని మేడారంలో ప్రచండమైన గాలులు వీచాయి. వాటి తీవ్రతకు దట్టమైన అడవులు సైతం నేల కూలిపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు వేర్లతో సహా బయటికి వచ్చాయి. అసలు ఇలా ఎందుకు జరిగిందనేది ఇప్పటికీ తెలియ రాలేదు. దాని వెనుక కారణం తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేదు.
మేడారంలో వీచిన ప్రచండ గాలుల మాదిరిగానే ఉత్తరప్రదేశ్లో కూడా భారీగా గాలులు వీచాయి. అంతేకాదు పెను బీభత్సం అనే స్థాయిలో వర్షాలు కురిసాయి. ఫలితంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఒక్కరోజే 89 మంది చనిపోయారు. వాస్తవానికి మే నెలలో ఉత్తర ప్రదేశ్ లో అంతగా వర్షాలు కురిసే అవకాశం లేదు. కాకపోతే ఈదురుగాలులు మాత్రం వీస్తాయి.. కానీ ఎన్నడూ లేనంతగా పలు జిల్లాలలో విపరీతంగా గాలి వీచింది. వర్షాలు కూడా అదే స్థాయిలో కురిశాయి. పిడుగులు పడ్డాయి. వడగండ్లు చెప్పనలవి కాకుండా పడ్డాయి. దీంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైంది. ఏకంగా 89 మంది చనిపోయారు. 53 మంది గాయపడ్డారు. 114 పశువులు చనిపోయాయి. 87 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి.
ప్రయాగ్ రాజ్ జిల్లాలో 21 మంది.. బదోహి ప్రాంతంలో 16.. ఫతేపూర్ లో 11 మంది.. సంత్ రవిదాస్ నగర్ 14 మంది.. మీర్జాపూర్ లో పదిమంది చనిపోయారు.. విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడే విరిగిపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు నేల కూలిపోయాయి.
మే నెలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. చాలా ప్రాంతాలలో 40 కి మించి టెంపరేచర్ ఉంటుంది. అయితే ఈ టెంపరేచర్ ఇటీవల కాలంలో పెరిగిపోయింది.. ఆ టెంపరేచర్ అలా పెరిగిపోవడంతో భూమి ఉపరితలంపై ఉన్న గాలి విపరీతంగా వేడెక్కింది. అది వేగంగా కదిలింది. అనేక దిశలలో వ్యాపించింది. తడి గాలిని పూర్తిగా లాగేసుకుంది. దీంతో ఇవి రెండు కలిసిపోయి ఆకాశంలో చాలా ఎత్తుకు చేరుకున్నాయి. సరదాగా అకస్మాత్తుగా మేఘాలు ఏర్పడ్డాయి. అవి ఆకాశము మొత్తం విస్తరించిపోయాయి. వెంటనే వర్షాలు కురవడం మొదలైంది. గాలులు విపరీతంగా వీయడంతో వడగండ్లపడ్డాయి. పిడుగులు కూడా పడ్డాయి.
యూపీలో ఇటువంటి వాతావరణం గతంలో ఎప్పుడు చూడలేదని అధికారులు అంటున్నారు. దీనిని బట్టి ప్రకృతి ఏదో ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తున్నట్టు అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బరేలి జిల్లా ప్రాంతంలో గాలుల తీవ్రతకు ఒక వ్యక్తి అమాంతం ఎగిరిపడ్డాడు. గాలి విపరీతంగా రావడంతో అతడు రేకుల షెడ్డుని పట్టుకున్నాడు. అయితే గాలి తీవ్రతకు రేకులతో సహా అతడు ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గా ఉందని ఉత్తరప్రదేశ్ అధికారులు చెబుతున్నారు.
This is horrific and shocking.
Approx 70 people, including women & children, were killed in yesterday’s massive storm in UP.
What kind of alert system do we even have? No emergency preparedness, only reel optics.
Also look at “smart villages.”pic.twitter.com/ObiUvSa6EX
— Manu (@mshahi0024) May 14, 2026