https://oktelugu.com/

ఆనంతో… రఘురామ్, ఏం జరుగుతుంది జగన్ ?

పాలకుడికి ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో, పాలక వర్గాన్ని అదుపులో పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం అధికారంలో ఉండడానికి కారణమైన ఎమ్మెల్యేల మధ్య సమన్వయం సాధించడంతో పాటు, వ్యతిరేకతను ఆదిలోనే అణచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా సొంత పార్టీకి చెందిన వ్యతిరేకులను భయపెట్టో, బుజ్జగించో అదుపులో పెట్టుకోవాలి. వారి ధిక్కార స్వరం రాష్ట్రం మొత్తం వినేలా చేసుకోకూడదు. వ్యతిరేక ఎమ్మెల్యేలు, లేదా ఎంపీలను దారికి తెచ్చుకోవడంలో అధినేత విఫలం చెందితే అది మరి కొంత […]

Written By: , Updated On : July 13, 2020 / 01:26 PM IST
Follow us on

Raghurama Raju selfie wit Anam Ramanarayana
పాలకుడికి ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో, పాలక వర్గాన్ని అదుపులో పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం అధికారంలో ఉండడానికి కారణమైన ఎమ్మెల్యేల మధ్య సమన్వయం సాధించడంతో పాటు, వ్యతిరేకతను ఆదిలోనే అణచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా సొంత పార్టీకి చెందిన వ్యతిరేకులను భయపెట్టో, బుజ్జగించో అదుపులో పెట్టుకోవాలి. వారి ధిక్కార స్వరం రాష్ట్రం మొత్తం వినేలా చేసుకోకూడదు. వ్యతిరేక ఎమ్మెల్యేలు, లేదా ఎంపీలను దారికి తెచ్చుకోవడంలో అధినేత విఫలం చెందితే అది మరి కొంత మందికి అలుసుగా మారుతుంది. ఒకరితో మొదలైన ఈ వ్యతిరేకత, ఉద్యమంగా మారే ప్రమాదం ఉంటుంది. పాలనపై దృష్టితో పాటు సొంత పార్టీ నేతల అభిప్రాయాలు, జరుగుతున్న పరిణామాలు, కుట్రలు ఎప్పటికప్పుడు అధినేత గమనిస్తూ ఉండాలి.

తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

ఈ విషయంలో జగన్ ఇంకా రాటుదేలినట్లు లేడు. ఆయన కేవలం పాలనపై దృష్టి సారించి, సొంత పార్టీ నేతల అవసరాలు, అభిప్రాయాల సేకరణ మరచినట్లున్నారు. దీనితో సొంత పార్టీ నేతలలో ఒకరొకరుగా ఆయనపై వ్యతరేక జెండా ఎగరవేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆయన వైసీపీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడంతో పాటు, ఆ పార్టీ అస్థిత్వాన్నే ప్రశ్నించారు. జగన్ కి విధేయుడిని అని చెవుతూనే పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించారు. చివరకు అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయవలసినదిగా లోక్ సభ స్పీకర్ కి వైసీపీ పార్టీ పిర్యాదు చేయడం జరిగింది. ఇది స్పీకర్ పరిశీనలో ఉండగా, వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఆయనపై కేసులు పెట్టడం జరిగింది. అరెస్టులు తప్పించుకొనే క్రమంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు హై కోర్ట్ లో స్క్వాష్ పిటీషన్ వేశారు. నేడు ఇది విచారణకు రానుంది.

ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

ఇదిలా ఉండగా రఘురామ కృష్ణం రాజు, వైసీపీ వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డితో కలిసి పెద్ద చర్చకు తెరలేపారు. వైసీపీ ప్రభుతంపై వ్యతిరేక జెండా ఎగరవేసి అమీతుమీ తేల్చుకుంటున్న రఘురామ కృష్ణం రాజు, ఆనం నారాయణ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. దీనికి తోడు గతంలో ఆనం కూడా వైసీపీ ప్రభుత్వంపై వ్యతరేక వ్యాఖలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేను అయ్యుండి కూడా నియోజకవర్గానికి ఏమి చేయలేకపోతున్నాని, అసలు వెంకటగిరి నియోజక వర్గం ఒకటి ఉందన్న విషయం, వైసీపీ ప్రభుత్వం మరచిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఇద్దరు అసంతృప్తి నేతలు కలవడం వెనుక కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రఘురామ కృష్ణం రాజు బీజేపీలో చేరో ఆలోచనలో ఉండగా, ఆనం కూడా ఆదిశగా అడుగులు వేస్తున్నారా అనిపిస్తుంది. ప్రస్తుతానికి వీరిద్దరి సెల్ఫీ ఫోటో మీడియాలో హల్ చేస్తుండగా, ఆనం మైకు ముందుకు వస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.