ఆంధ్రప్రదేశ్‌Balakrishna Cabinet Entry Andhra Pradesh: మంత్రివర్గంలోకి నందమూరి, మెగా ఫ్యామిలీ?!

Balakrishna Cabinet Entry Andhra Pradesh: మంత్రివర్గంలోకి నందమూరి, మెగా ఫ్యామిలీ?!

Balakrishna Cabinet Entry Andhra Pradesh: పొలిటికల్ గ్యాసిప్స్( political gossips ) అనేవి సర్వసాధారణం. ఎన్నికలతో పని లేకుండా ఇవి వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ విషయంలో ఒక వార్త వైరల్ అవుతోంది. త్వరలో నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అన్నది ఈ వార్త సారాంశం. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే వార్త పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అదే జరిగితే నందమూరి అభిమానులకు శుభవార్త. అయితే అదే సమయంలో కొన్ని రకాల సమీకరణల దృష్ట్యా.. బాలకృష్ణ కు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యమేనా అనే చర్చ నడుస్తోంది.

* నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం..
ఏపీ రాజకీయాలతో( Andhra Pradesh politics) పాటు సినిమా రంగాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్ నట వారసుడిగా తెరపైకి వచ్చారు బాలకృష్ణ. సినిమా రంగంలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. రాజకీయాల్లోకి కూడా వచ్చారు. 2014 నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తొలిసారిగా హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. హిందూపురం అంటే నందమూరి కుటుంబానికి పెట్టని కోట. అటువంటి చోట హ్యాట్రిక్ విజయం సాధించారు నందమూరి బాలకృష్ణ. ముచ్చటగా మూడోసారి గెలిచేసరికి బాలకృష్ణ కు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది.

* ఆ విమర్శకు చెక్..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) నందమూరి ఫ్యామిలీకి సరైన ప్రాధాన్యత లేకుండా పోయిందన్న విమర్శ రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తూ ఉంటుంది. కానీ అటువంటిదేమీ పట్టించుకోరు నందమూరి బాలకృష్ణ. తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా హిందూపురం నియోజకవర్గానికి మాత్రం దగ్గరగానే ఉంటారు. ఇటీవల బాలకృష్ణ భార్య వసుంధర దేవి సైతం తరచూ హిందూపురం నియోజకవర్గం లో పర్యటిస్తూ వస్తున్నారు. బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని హిందూపురం నియోజకవర్గం ప్రజలతో పాటు నందమూరి కుటుంబాభిమానులు కోరుతూ వచ్చారు. అయితే ఇప్పటికే క్యాబినెట్లో బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. బావ చంద్రబాబు సీఎం గా ఉన్నారు. బాలకృష్ణ కు మంత్రి పదవి ఇస్తే రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తారన్న ఆలోచన చంద్రబాబులో ఉంది. ఇటువంటి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కు మంత్రి పదవి ఇస్తారా? అనేది ఒక అనుమానం.

* నాగబాబుతో పాటే..
త్వరలో మెగా బ్రదర్ నాగబాబును( Mega brother Naga babu ) మంత్రి వర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే నాగబాబును ఎమ్మెల్సీ చేశారు. విస్తరణలో ఆయనకు మంత్రి పదవి ఖాయం. అయితే మెగా కుటుంబంలో ఇద్దరికి ఇచ్చి.. నందమూరి కుటుంబంలో ఒకే ఒక్కడుగా ఉన్న బాలకృష్ణకు ఇవ్వకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అంచనాలు ఉన్నాయి. పైగా నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న విమర్శకు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా చెక్ చెప్పవచ్చు. అందుకే ఈసారి మంత్రి పదవి బాలకృష్ణ కు ఖాయం అన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. వీలైనంత త్వరగా పెండింగ్ సినిమాలు పూర్తి చేసి.. రాజకీయంగా యాక్టివ్ కావాలని చూస్తున్నారు బాలకృష్ణ( Nandamuri Balakrishna). మెగా ఫ్యామిలీతో పాటు నందమూరి కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. ఆ రెండు కుటుంబ అభిమానులతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు స్కెచ్ వేసినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Oktelugu Epaper
Exit mobile version