https://oktelugu.com/

లేటు వయసులో వేశ్య పాత్రతో టబు సంచలనం

హైదరాబాద్‌లో పుట్టి బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది టబు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సూపరిచితమే. హిందీతోనే తెరంగేట్రం చేసినా.. వెంకటేశ్‌ సరసన ‘కూలీ నం.1’తో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఒకవైపు హిందీలో దూసుకుపోతూనే.. తెలుగులో కూడా కెరీర్ కొనసాగించింది. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ సరసన నటించింది. 2008లో ‘పాండు రంగడు’ తర్వాత టాలీవుడ్‌కు దూరమైన ఆమె రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె పేరు తరచూ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. హిందీలో ఆమె విలన్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 13, 2020 / 01:04 PM IST
    Follow us on


    హైదరాబాద్‌లో పుట్టి బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది టబు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సూపరిచితమే. హిందీతోనే తెరంగేట్రం చేసినా.. వెంకటేశ్‌ సరసన ‘కూలీ నం.1’తో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఒకవైపు హిందీలో దూసుకుపోతూనే.. తెలుగులో కూడా కెరీర్ కొనసాగించింది. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ సరసన నటించింది. 2008లో ‘పాండు రంగడు’ తర్వాత టాలీవుడ్‌కు దూరమైన ఆమె రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె పేరు తరచూ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. హిందీలో ఆమె విలన్‌ పాత్ర పోషించిన ‘అంధాధున్‌’ తెలుగు రీమేక్‌లో ఆమెనే విలన్‌గా నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని ‘రంగ్‌దే’ పేరుతో నితిన్‌ హీరోగా తెరకెక్కిస్తున్నారు. అయితే, దీనిపై పెదవి విప్పకపోయినప్పటికీ.. ఇప్పుడు ఓ వెబ్‌ సిరీస్‌తో టబు సంచలనానికి తెరలేపింది.

    తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

    ‘ఎ సూటబుల్‌బాయ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో టబు నటించింది. ఇందులో విశేషం ఏముందంటరా? 48 ఏళ్ల టబు ఇందులో సెక్స్‌ వర్కర్ పాత్రను పోషించింది. ‘కామసూత్ర’ డైరెక్టర్ మీరా నాయర్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో నలభై ఏళ్ల పైబడిన వేశ్యగా ఆమె నటించింది. ఆమెను ప్రేమించే 20 ఏళ్ల కుర్రాడి పాత్రను యువ హీరో, షాహిద్‌ కపూర్తమ్ముడు ఇషాన్‌ ఖత్తర్పోషించాడు. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగిందన్నదే కథ. ట్రైలర్లో టబు, ఇషాన్‌ రొమాన్స్‌ హైలైట్‌గా మారింది. 1993లో ‘ఎ సూటబుల్‌ బాయ్‌’ పేరుతో విక్రమ్‌ సేథ్‌ రాసిన నవల ఆధారంగా సిరీస్‌ తీస్తున్నారు. ఇదో పీరియాడికల్‌ ఫిక్షన్‌ స్టోరీ అని సమాచారం. ఇండియాకు స్వాతంత్య్రం అనంతర ఎన్నికల బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు కుటుంబల మధ్య జరిగే కథ ఇది. అప్పటి పరిస్థితులు, కుటుంబ విలువలు, మత వివక్ష లాంటి అంశాలను ఈ పుస్తకంలో వివరించారు విక్రమ్‌ సేథ్. దాదాపు 1500 పేజీల ఈ ఇంగ్లిష్‌ నావెల్‌ను ఆరు భాగాలుగా కుదించి వెబ్‌ సిరీస్‌ తీశారు. ఈ సిరీస్‌తో బీబీసీ సంస్థ ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ నెల 26 నుంచి బీబీసీలో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమ్‌ కానుంది. హిందీతో పాటు ఇంగ్లిష్‌లో రిలీజ్‌ అవుతుంది.

     

    https://www.youtube.com/watch?v=aPBnlHmsexU