Homeబిజినెస్LG Gram 14 Slim Design Laptop: స్లిమ్ డిజైన్.. మెరుగైన బ్యాటరీ.. ఆకట్టుకుంటున్న...

LG Gram 14 Slim Design Laptop: స్లిమ్ డిజైన్.. మెరుగైన బ్యాటరీ.. ఆకట్టుకుంటున్న LG కొత్త లాప్టాప్.. త్వరపడండి

LG Gram 14 Slim Design Laptop: ఉద్యోగ అవసరాలతో పాటు విద్యార్థులకు ప్రస్తుత కాలంలో Laptop తప్పనిసరి. అయితే ఇందులోనూ మొబైల్ వలె బెస్ట్ ఫీచర్స్.. బ్యాటరీ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అందించే కంపెనీల్లో ప్రముఖమైనదిగా LG గురించి చెబుతూ ఉంటారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటివరకు డెస్క్ టాప్ తో పాటు ల్యాప్టాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే లేటెస్ట్ గా కొత్త మోడల్ ను లాంచ్ చేసింది. ఇందులో ఉన్న ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా దీని డిజైన్ కూడా ఇంప్రెస్ చేయడంతో చాలామంది దీని గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ లాప్టాప్ ఫుల్ డీటెయిల్స్ ఏవో చూద్దాం..

Also Read: ఎండాకాలం రాబోతుంది.. ఇక ఏసీలు కొనే పరిస్థితి లేదా?

ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ LG నుంచి లేటెస్ట్ గా LG Gram 14 అనే లాప్టాప్ ను ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందులో 14 అంగుళాల డిస్ప్లే తో చూడొచ్చు. ఈ డిస్ప్లే 60 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 350 nits బ్రైట్నెస్ ఉండే ఇందులో విజువల్స్ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇతర వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. వీడియోలు చూసేవారికి కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. కొత్త ఏడాదిలో మార్కెట్లోకి వస్తున్న అతి చిన్న మోడల్ గా ఇది పేరు తెచ్చుకుంది. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సులువుగా ఉండేలా డిజైన్ చేశారు. ఎందుకంటే దీని బరువు కేవలం 1.12 కిలో గ్రాములు మాత్రమే. 15.7 మిల్లీమీటర్ల మందంతో ఉండడంతో రక్షణగా ఉంటుంది. ఉద్యోగులతో పాటు విద్యార్థులు వ్యాపారస్తులు సైతం దీంతో ట్రావెల్ చేయవచ్చు. అయితే ఇందులో ఉండే బ్యాటరీ పర్ఫామెన్స్ మెరుగ్గా ఉందని తెలుస్తోంది.72 kWh బ్యాటరీ ఉండడంతో చార్జింగ్ విషయంలో ది బెస్ట్గా నిలుస్తుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే వాడకాన్ని బట్టి ఎక్కువ సేపే ఉండే విధంగా సెట్ చేశారు. మిగతా వాటిలో కంటే ఇందులో తేలికైన బ్యాటరీ ఉండడంతో దీని బరువు కూడా తక్కువగా అనిపిస్తుంది.

ఇప్పటికే జపాన్ మార్కెట్లో విడుదలైన ఈ లాప్టాప్ JPY అనే మోడల్ ధర రూ.1.27 లక్షలు గా ఉంది. అయితే స్పెసిఫికేషన్స్ లేదా కాన్ఫిగరేషన్ మార్చుకొని టాప్ ఎండ్ వెర్షన్ లో కొనుగోలు చేయాలనుకుంటే రూ.2.05 లక్షలు గా ఉంది. అయితే ప్రస్తుతానికి జపాన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఇతర దేశాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. అయితే 2026 లో ఈ లాప్టాప్ ప్రత్యేకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.

 

Also Read: ఆంథ్రోపిక్‌.. ఏఐలో ఓ సునామీ… దీంతో ఏమవుతుంది? ఏ మార్పులు రాబోతున్నాయి

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version